ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 28 శుక్రవారం
తెలంగాణ ఆర్టీసీ టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనుంది.. ప్రయాణికులే స్వయంగా టికెట్ తీసుకునే అవకాశాన్ని కల్పించబోతోంది. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రయాణికులు బస్సు టికెట్ తీసుకునేలా ప్లాన్ చేశారు. ముందుగా ఈ విధానాన్ని నల్గొండ టు హైదరాబాద్ నాన్‌స్టాస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో అమలు చేయనున్నారు. బస్సు ఎక్కే ముందు టికెట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ టికెట్‌ను తీసుకొచ్చారు. ఈ నాన్‌స్టాప్ బస్సుల్లో ప్రయాణికులే స్వయంగా టికెట్ తీసుకునేలా ఆర్టీసీ ప్లాన్ చేసింది. బస్సు ఎక్కే ముందు డోర్ దగ్గర ఏర్పాటు చేసే క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ మొబైల్‌లో స్కాన్ చేయాలి.. అప్పుడు టికెట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా బస్సు ఎక్కే స్టాప్, దిగే స్టాప్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే టికెట్ బుక్ అవుతుంది.. దాన్ని డ్రైవర్‌కు చూపిస్తే సరిపోతుంది.















