ఈతరం భారతం ఖాట్మండు ఆగస్ట్ 29
నేపాల్ వరదల్లో భారతీయుల గల్లంతుపై భారత విదేశాంగశాఖ కీలక ప్రకటన చేసింది. విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతయ్యారని అన్నారు. చైనాలో ఉన్న 400 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, స్పష్టం చేశారు. చైనాలో చిక్కుకుపోయిన పౌరులను స్వదేశానికి తరలించేందుకు భారత అధికారులు, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. బీజింగ్ లోనూ భారత రాయబార కార్యాలయం నిర్వహిస్తున్న హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా బాధితుల కుటుంబ సభ్యులు చాలా మంది తమకు సంప్రదించారన్నారు.పౌరులను తరలిచేందుకు బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతం నుండి గురువారం కాఠ్మండుకు 21 మంది భారతీయులు చేరుకున్నారని, వారు శుక్రవారం ఢిల్లీలో దిగారని చెప్పారు. ఆ 21 మంది భారతీయులు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారని అన్నారు. త్రిశూలి వన్ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63మంది భారతీయులను కూడా రక్షించినట్టు తెలిపారు. అంతేకాకుండా చైనా వైపు చిక్కుకున్న మరో 96 మంది భారతీయులు భూమార్గం ద్వారా నేపాల్ లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు తాము 320 మంది భారతీయులను సంప్రదించలేపోయామని తెలిపారు. అంతేకాకుండా మరో 100 మంది భారత సంతతికి చెందిన విదేశీయుల ఆచూకీ కూడా దొరకలేదన్నారు.















