EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పొలం గట్టున ఆత్మీయ పలకరింపు …  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఈతరంభారతం ఖమ్మం ఆగస్టు 30 ఆదివారం :

మండుటెండను సైతం లెక్కచేయకుండా రోజంతా పొలంలో చెమటోడ్చి పని చేసిన ఆ శ్రమజీవులకు.. ఆదివారం ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట శివారుల్లో కనిపించిన ఓ అరుదైన దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది.

నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. హంగూ ఆర్భాటాలకు దూరంగా, నేరుగా పంట పొలాల్లో కూలి పనులు చేస్తున్న మహిళల వద్దకు వెళ్లారు. మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతున్న ఆడబిడ్డల మధ్యకు ఆయన ఓ సొంత అన్నలా అడుగులు వేశారు. హోదాను పక్కన పెట్టి.. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. “ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీ ఇళ్లకు అందుతున్నాయా తల్లులారా?” అంటూ ఆప్యాయంగా పలకరించారు.అధికారపు హంగులు, ఆర్భాటాలు లేకుండా.. వారితో ఆత్మీయంగా మాట్లాడారు. భట్టి విక్రమార్కను తమ మధ్య చూసిన ఆ మహిళల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం తమ జీవితాల్లో వచ్చిన మార్పులను చెబుతూ వారు భావోద్వేగానికి లోనయ్యారు. “ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంతోనే ఇంట్లో సంతోషంగా అన్నం వండుకుని తింటున్నాం.. మా పిల్లాపాపలు కడుపునిండా అదే అన్నం తింటున్నారు” అని చెప్పినప్పుడు వారి మాటల్లో కనిపించిన తృప్తి.. సంక్షేమ పథకాల అసలైన అర్థాన్ని కళ్లముందు నిలిచింది. కరెంటు బిల్లుల గురించి అడిగినప్పుడు.. “మాకు రూపాయి బిల్లు కూడా రావడం లేదు సార్.. ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది” అని వారు చెప్పిన మాటల్లో.. ఎన్నాళ్లుగానో మోస్తున్న ఆర్థిక భారాన్ని దించుకున్న నిశ్చింత స్పష్టంగా కనిపించింది

ఇటీవల హైదరాబాద్‌కు కూలీ పనుల కోసం వెళ్లిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆ మహిళలు.. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతగానో ఉపయోగపడిందని ఆనందంగా చెప్పారు. ప్రయాణ చార్జీల కోసం ఖర్చయ్యే డబ్బు మిగలడం.. తమ కుటుంబ అవసరాలకు ఎంతో ఆసరాగా మారిందని కృతజ్ఞతతో తెలిపారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మా జీవితాల్లో నిజమైన వెలుగులు నింపుతున్నాయని శ్రమజీవులు ఆనందంగా చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మీరు ఉచితంగా పొందుతున్న ప్రతి పథకానికి మీ తరఫున ఆర్థిక శాఖ ఆయా శాఖలకు క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తోంది. ప్రజల అవసరాలను గుర్తించడం.. ఆ అవసరాలను తీర్చడం.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఈ ప్రజా ప్రభుత్వం అసలైన బాధ్యతని చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top