ఈతరం భారతం వార్తాంశం:
నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా సాయి చౌదరితో ప్రత్యేక కథనం…,
వికారాబాద్ సెప్టెంబర్ 30: చిన్ననాటి నుండి బిడ్డల ఆలనాపాలనా చూసి తీరా మలి వయసుకు చేరుకునేసరికి అదే బిడ్డల చేతుల్లో చిత్కారాలు ఎదుర్కొనే ముసలివారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. అంతేకాదు మరి కొందరు బిడ్డలైతే తల్లిదండ్రులను ఏకంగా బ్రతికుండగానే బస్టాండ్లో వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి బాధ కలిగించే ఘటనలు మన సమాజంలో కోకొల్లలు. ఇక మరికొందరేమో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు. అయితే వృద్ధాప్యంలో మీకు కావలసింది ఏమిటి అని మళ్లీ వయసు వారిని పలకరిస్తే వచ్చే సమాధానం మాత్రం సమయానికి నాలుగు మెతుకులు పెట్టి కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు అని. అది నిజమేగా, ఆ వయసులో వారిని అంతకన్నా ఆనందపరిచే అంశం మరొక మరొకటి ఉండదు కదాఅని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు. నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ సందర్భంగా సాయి చౌదరితో ప్రత్యేక కథనం…,
మరి అలాంటి చిన్న చిన్న కోరికలకే సంతృప్తి పడే మన ఇంటి పెద్దలను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కేవలం ప్రేమ మాత్రమే అందిస్తే చాలదు, వారి ఆరోగ్యం కాపాడుకోవటం ముఖ్యమే. అరవై దాటాక ఆ పెద్దలు చిన్నపిల్లల కిందనే లెక్క. వారికి అది రెండో బాల్యము! పెద్దయ్యే వరకు బిడ్డను ఎలా జాగ్రత్తగా పెంచుతామో, వీరిని అంతే జాగ్రత్తగా సంరక్షించాలి. అందుకే మలి వయసు వారికి తోడుగా ఎలా మసులుకోవాలో తెలుసుకోండి! అని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు.
పదవీ విరమణ సంకేతం కాదు
మన జీవన పరిస్థితులు, వైద్య సదుపాయాలు మెరుగవుతున్న కొద్ది ఆయుప్రమాణము మెరుగవుతుందని కొన్ని రకాల అధ్యయనాలు చెప్తున్నాయి. ఒకరకంగా వైద్య రంగంలో సాధించిన పురోగతి ఎందుకు కారణము. అందుకే ఒకప్పుడు పదవీ విరమణ అంటే మళ్ళీ వయసు కిందకే లెక్క పెట్టేవారు. కానీ ఇప్పుడు పదవీ విరమణ అంటే జీవితంలో మరో దశకు శ్రీకారం చుట్టినట్లుగా భావిస్తున్నారు. అయితే ఆయుప్రమాణము పెరగటం మాత్రమే కాదు. వ్యాధుల వలలో ఇక్కట్లను అనుభవించే కాలము ఈ వయసుదేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి అని సాయి చౌదరి పేర్కొన్నారు.
తొందర పెట్టకండి
పెద్దవాళ్లు ఏ పనులు చేస్తున్నా సరే, వారిని తొందర పెట్టకండి. 60 దాటాక వారిలో చురుకుతనం కాస్త తగ్గుతుంది. ఏదైనా నెమ్మదిగా చేస్తుంటారు. పూర్వం లాగా చకచగా చేయలేరు. కంగారు పెడితే పని సరిగ్గా పూర్తి చేయలేక అసౌకర్యానికి గురవుతారు. పైగా ఆ వయసులో అనారోగ్య సమస్యల వల్ల కొన్ని పనులు ఆశలు చేయలేరు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని మెల గాలి తప్ప, అన్ని వేలకు పూర్తి కావాలని వారికి హుకుం జారి చేయకూడదు. అవసరమైతే మన పెద్దవాళ్ల పనులు మనమే చేసి పెట్టాలి. వీలైనంతవరకు వారికి ఎక్కువ పని అప్ప చెప్పకపోవటమే మంచిది. ఒకవేళ చెప్పిన వారిని తొందర పెట్టకూడదు.
ప్రేమను పంచండి
ఎంతకాలం అనుభవించినా, ఇంకా యవ్వనంలోనే ఉన్నామన్న భావన కలిగించే మహత్యం కేవలం ప్రేమకే ఉంది. ప్రేమను స్వీకరించడమే కాదు ఇవ్వటంలో కూడా ఆనందమే ఉంది. ప్రేమ భావంఉత్సాహానిస్తుంది. అందుకే మలి వయసులో పెద్దలతో కుటుంబ వివాదాల జోలికి వెళ్లకపోవటమే మంచిది. ఈర్ష, ద్వేషము, అసూయ వంటి వాటికి దూరంగా ఉండి మీ తల్లిదండ్రులకు ప్రేమను పంచండి. మీ పిల్లలకు కూడా వారితో ఎలా నడుచుకోవాలో నేర్పించండి. కన్న బిడ్డలుగా మనం వారికి తగిన గౌరవం ఇవ్వకపోతే మన పిల్లలు,భార్య కూడా వారికి గౌరవం ఇవ్వ ఇవ్వరు. అందుకే మనల్ని కనిపెoచి పెద్ద చేసిన మాన తల్లిదండ్రుల పట్ల కడవరకు ప్రేమగా మెలగాలి. ఆ వయసులో వారికి చాదస్తం ఉంటుంది. కొంతమంది అయితే ప్రతిదానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. పదేపదే గతాన్ని గుర్తు చేసే వాక్యానాలు చేస్తారు. ఎంత చేసినా ఇంకా చేయాలంటారు. అలాంటి సందర్భాలలో సహనం కోల్పోవడం సహజం. వారి మీద అరిచేస్తుంటారు. అందుకే పెద్దవారితో మాట్లాడేటప్పుడు, సేవలు చేసేటప్పుడు ఓపిక చాలా అవసరం. మీరు చిన్నప్పుడు చేసిన అల్లరికి మీ అమ్మ ఎంతో సహనంగా ఓపికగా ఉంటూ మిమ్మల్ని పెంచింది కదా. ఇది కూడా అలాంటిదే. అంతటి సహనము ఓపిక మీరు కూడా తెచ్చుకోవాలి. ఆఫీసుకు వెళ్లేటప్పుడు, వచ్చాక మధ్యలో ఒకసారి వారిని ప్రేమగా పలకరిస్తే వారు చాలా ప్రశాంతంగా ఉంటారు . పైగా వారికి దిగాలు అనేది ఉండదు అని సాయి చౌదరి అన్నారు
పండుటాకులకు “ఆత్మీయ” నీడ
జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆయా రంగాలలో ఎంతో అనుభవం గడించిన వృద్ధుల తమ అనుభవాలను కష్టసుఖాలను పంచుకునేందుకు వేదికవుతున్నది. ఇక్కడికి వచ్చే వారిలో ప్రధానంగా ప్రభుత్వ మాజీ ఉద్యోగులు, కార్మికులు, వ్యాపార సంస్థల్లో పని చేసిన వారు, వ్యవసాయంలో ఆరితేరిన వారు, ఒకప్పటి కవులు, రచయితలు, కళాకారులు ఉంటున్నారు. వీరు రోజంతా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఇక్కడికి వచ్చి సమ వయస్కులతో గడపటం వల్ల తమ కష్టాలను మరిచిపోతున్నామని చెబుతున్నారు.
డే కేర్ సెంటర్
పండుటాకులకు చల్లని నీడలా మారింది. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భవనములో అన్ని రకాల దినపత్రికలు, క్రీడా పరికరాలు అందుబాటులో ఉండటంతో పాటు సమ వయస్కులతో కబుర్లు చెప్పుకునే అవకాశం ఉండటంతో వృద్ధులకు మంచి కాలక్షేపమవుతుంది. అంతేకాదు పిల్లల ఆదరణ కరువైన పెద్దల్లో మనోధైర్యం నింపుతుంది. జీవితంలో ఎక్కువ సమయము పిల్లల ఉన్నతికే పాటుపడ్డారు. ప్రస్తుతము వృద్ధాప్యానికి చేరారు. వీరిలో చాలామంది పరిస్థితి దయనీయంగా మారింది. వృద్ధులను పిల్లలు పట్టించుకోకపోవడంతో నిరాదరణకు గురవుతున్నారు. ఇది ఆందోళనకర పరిణామం. కొందరు ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలలో ఉంటే, ఇక్కడ ఉంటున్నటువంటి తల్లిదండ్రులకు ఒంటరితనం తప్పడం లేదు. ఇలాంటి వయోవృద్ధుల ఇబ్బందులను దూరం చేయాలనే లక్ష్యముతో డే కేర్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వము నిర్ణయించింది. జిల్లాకు ఒకటి చొప్పున మంజూరు చేసినారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వికారాబాద్ లో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి మాట్లాడుతూ ఇంట్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్న వారికి డే కేర్ సెంటర్ తో ప్రయోజనం చేకూరుతుందని, కొందరు కుమారులు, కుమార్తెల వద్ద ఉంటున్నారని, కుటుంబీకులు ఉద్యోగాలకు, వారి పిల్లలు పాఠశాలలకు వెళితే సాయంత్రం వరకు ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. డే కేర్ సెంటర్ కు వెళితే అక్కడ సాయంత్రం వరకు కాలక్షేపము చేసేందుకు వీలు ఉంటుందని సాయి చౌదరి తెలిపారు.
డే కేర్ సెంటర్లలో చేరాలంటే ముందుగా పేర్ల నమోదు చేసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేరేందుకు అర్హత కల్పిస్తారు. సెంటర్లో వంటగది ఉంటుంది. నమోదైన వారికి ఒక పూట భోజనము అందిస్తామని, ఉదయము పూట రాగి జావ గాని, పండ్లు గాని, టీ గాని, బిస్కెట్లు గాని, ఉప్మా వంటివి అందిస్తున్నామని సాయి చౌదరి తెలిపారు. విశాలమైన హాలుతోపాటు, క్యారమ్స్ వంటి ఆట వస్తువులను ఏర్పాటు చేస్తామని ఆధ్యాత్మిక, సాహిత్య, దినపత్రికలతో కూడిన గ్రంథాలయం ఉంటుందని సాయి చౌదరి తెలిపారు. కావున వయోవృద్ధులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవలసిందిగా కోరారు.















