EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వికారాబాద్ జిల్లాలో డీజీ భగవత్ పర్యటన భవనాల నిర్మాణ పనుల తనిఖీ

ఈతరం భారతం వికారాబాద్ సెప్టెంబర్ 30:

__________________________________

తెలంగాణ లా & ఆర్డర్ డీజీ, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ భగవత్ వికారాబాద్ జిల్లాలో పర్యటించి బొంరాస్‌పేట్, కొడంగల్, దుద్యాల పోలీస్ స్టేషన్లతో పాటు కొడంగల్ సీఐ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లాకు విచ్చేసిన ఆయనకు ఎస్పీ స్నేహ మెహ్రా స్వాగతం పలకగా, అనంతరం అధికారులతో కలిసి భవనాల్లోని గదులు, మౌలిక వసతులు, నీరు, విద్యుత్ సరఫరా, పారిశుధ్య ఏర్పాట్లను తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, కాంట్రాక్టర్లు-అధికారులు సమన్వయంతో వ్యవహరించి నిర్ణీత గడువులోగా భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది మరియు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు శ్రీనివాస్ రావు, బాలాజీ దాస్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top