EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

లోక్ సత్తా పార్టీ 20 ఆవిర్భావ దినోత్సవం ఘనంగా వేడుకలు

ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 2:

________________________________

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 33 నెలలు గడిచిపోయినా పాలనపై పట్టు సాధించలేదని ప్రజా సమస్యలు పక్కనబెట్టి గత ప్రభుత్వంపై నిందలు, ఆరోపణలు చేస్తూ ఇచ్చిన హామీలను మభ్య పెడుతూ కాలం వెల్లదీస్తుందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన లోక్ సత్తా పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పై విధంగా అన్నారు.

గత ప్రభుత్వ అక్రమాలపై గాయి గాయి చేయకుండా గట్టి చర్యలు చేపట్టాలని చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని దోషులను ప్రజల ముందు ఉంచాలని తుమ్మనపల్లి డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన విశేష అధికారాలను పక్కన బెట్టుకొని గత పాలకుల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం ఎందుకు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. లోక్ సత్తా పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేస్తామని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉదృతంగా నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారాలపై ప్రజలను సమాయత్తం చేసి పోరాటాలను నిర్మిస్తామని తుమ్మనపల్లి స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మెట్ల జగన్, సరోజాదేవి, చలపతి రావు, లోహిత్ కుమార్ , విజయ్ , దొడ్ల శేఖర్ , కొప్పుల శ్రీధర్, కాసోజు శివ,

వంగల రామాచారి, శివరామ కృష్ణ, మారుమోకం వెంకటీ, కుందేటి రవి, బాణాల ద్రోణ చారి, పద్మా శేఖర్, శ్రీనివాస్ రావు, వెంకట్ నారాయణ, ప్రభాకర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top