EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆమె ప్రయాణం చాలా మందికి ఇన్స్పిరేషన్…

ఈతరం భారతం వార్తాంశం:

_______________________

అసలు పేరు: గుండెబోయిన ఝాన్సీ ముదిరాజ్ , • స్వస్థలం: కోమటికుంట గ్రామం, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ • తల్లిదండ్రులు: సైదులు, హేమలత • వృత్తి: జానపద గాయని, వ్యవసాయం • చదువు: M.Sc Organic Chemistry (ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ) 2. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ & కష్టం

ఝాన్సీ ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చింది. ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడితో కూడిన ఆమె కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది. తండ్రి కేబుల్ ఆపరేటర్‌గా, మున్సిపాలిటీలో ఎలక్ట్రీషియన్‌గా కూడా పని చేస్తారు.  తొమ్మిదో తరగతి నుంచే తండ్రికి సహాయంగా పొలం దున్నడం నుంచి వరి కోత వరకు అన్ని పనుల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. తండ్రి అనారోగ్యానికి గురైనప్పుడు తమ్ముడితో కలిసి వ్యవసాయ బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకుంది.

# చదువులో టాపర్

వ్యవసాయం చేస్తూనే చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంటర్‌లో 926 మార్కులు సాధించి, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసింది.

# సింగర్ గా జర్నీ

చిన్నప్పటి నుంచే పాటలు పాడటం అంటే ఇష్టం. 3వ తరగతిలో “ఆడపిల్ల నమ్మ నేను ఆడపిల్లని” అనే పాట పాడి ప్రశంసలు పొందింది. ఎలాంటి పెద్ద సంగీత బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే తన సహజ ప్రతిభతో జానపద గాయనిగా ఎదిగింది.

ఆమెకు గుర్తింపు తెచ్చిన పాటలు – ‘రామ్‌రెడ్డి దొర’, ‘అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య’, ‘నాజూకు పిల్లోడు’, బతుకమ్మ పాటలు వంటివి. తెలంగాణ పల్లె జీవితం, మట్టి వాసన ప్రతిబింబించే పాటలను తనదైన మాస్ వాయిస్‌తో పాడుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయింది.  ఆమె సక్సెస్ వెనుక తమ్ముడి కృషి చాలా ఉంది. ఝాన్సీ చేసే ప్రతి పనిని వీడియో తీసి ఎడిట్ చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి ప్రోత్సహించాడు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షలకు పైగా, యూట్యూబ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది.

# బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు 10 కామనర్ల కోసం నిర్వహించిన అగ్నిపరీక్ష సీజన్ 2 లో 15 మంది మధ్య పోటీపడి విజేతగా నిలిచి, హౌస్‌లోకి నేరుగా ఎంట్రీ పొందిన మొదటి మహిళా కంటెస్టెంట్‌గా ఘనత సాధించింది. బిగ్ బాస్ హౌస్‌లోకి కన్ఫర్మ్ అయిన తొలి కంటెస్టెంట్ ఝాన్సీ కావడం విశేషం.

హౌస్‌లోకి వెళ్తూ ఆమె చెప్పిన మాట – “పొలంలో మందు చల్లేటప్పుడు అలసిపోయినా నాన్న బాధపడతాడని ఆగకుండా పని చేస్తాను, అలాగే బిగ్ బాస్ హౌస్‌లో కూడా వెనక్కి తగ్గేది లేదు” అని.

సింపుల్ రైతుబిడ్డ నుండి సోషల్ మీడియా స్టార్, అక్కడి నుండి బిగ్ బాస్ వరకు ఆమె ప్రయాణం చాలా మందికి ఇన్స్పిరేషన్….

Related News

Select the Topic
Scroll to Top