EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నల్గొండలో రూ.74 కోట్లతో రెండు డబుల్ రోడ్లు

ఈతరం భారతం నల్గొండ అక్టోబర్ 11 :

______________________________

నల్గొండ నియోజకవర్గంలో రూ.74 కోట్లతో నిర్మించనున్న రెండు డబుల్ రోడ్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.తేలకంటిగూడెం నుంచి తొరగల్లు, జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రూ.41 కోట్లతో, ఎస్‌.లింగోటం నుంచి చెట్లచెన్నారం, చిన్నమాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రూ.33 కోట్లతో రోడ్లు నిర్మించనున్నారు.

తేలకంటిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పైలట్‌ ప్రాజెక్టు కింద 107 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.శ్రీశైలం సొరంగ మార్గం పనులను వేగవంతం చేసి 2028 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. చెరువులు నింపేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల కోసం రూ.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Related News

Select the Topic
Scroll to Top