ఈతరం భారతం కొయ్యలగూడెం యాదాద్రి భువనగిరి అక్టోబర్ 13:
__________________________________________________
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కొయ్యలగూడెం నుంచి కోదాడ మధ్య హోటళ్లలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి టీజీ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు.పలు హోటళ్లలో ఆహార నిల్వ ప్రాంతాల్లో బొద్దింకలు, ఎలుకలు కనిపించాయి. అపరిశుభ్రమైన వంటగదుల్లో ఆహారం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.వంటకు ఉపయోగించే పప్పులు, ఇతర పదార్థాలకు పురుగులు పట్టినట్లు గుర్తించారు. మాంసం, పాల ఉత్పత్తులను సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయకపోవడంతో పాటు, ముందు రోజు వండిన ఆహారాన్ని కూడా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.నిబంధనల ఉల్లంఘనలపై కొన్ని హోటళ్లను మూసివేయనున్నారు. మరికొన్నింటికి వివరణ కోరుతూ నోటీసులు లేదా లోపాలను సరిచేసుకోవాలని ఆదేశించే నోటీసులు జారీ చేయనున్నారు.















