EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఓపెన్ కాస్ట్ బొగ్గు బొగ్గు గనిని నిలిపివేయాలి  :  రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి రామ్మోహన్ రావు

ఈ తరంభారతం వరంగల్ అక్టోబర్ 21:

;వెంకటాపూర్ శివారులో ఏర్పాటు చేయనున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గని వల్ల ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప దేవాలయానికి ముప్పు వాటిల్లనుందని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ అక్కిరెడ్డి రామ్మోహన్ రావు అన్నారు. బుధవారం తన పర్యటలో భాగంగా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చేరుకున్న మంత్రి సీతక్కను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి రామ్మోహన్ రావు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో భాగంగా జరిపే బ్లాస్టింగ్ ల వల్ల ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర గలిగిన రామప్ప దేవాలయ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందని, శతాబ్దాల నాటి శిల్పాలతో పాటు గుడి కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన మంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని, రామప్ప పరిరక్షణ కై ప్రభుత్వం కృషి చేయాలని ఆమెను కోరారు. స్పందించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ…ప్రపంచ వారసత్వ సంపద కలిగిన రామప్ప దేవాలయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, అలాంటి రామప్పకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త వహిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని, ఈ ప్రాంత ప్రజలు ఎవరూ అధైర్య పడవద్దని ఆమె సూచించారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి తవ్వకాలు చేపట్టకుండా అధికారులతో సమావేశమై చర్చిస్తానని, పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక లేకుండా ఎలాంటి ప్రాజెక్టుకూ అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ రామ్మోహన్ రావు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మంత్రి సీతక్కకు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related News

Select the Topic
Scroll to Top