ఈతరం భారతం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 1:
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి మురసు తుఫాన్ గా మారనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ .తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సముద్ర తీర ప్రాంతాలకు పర్యాటకులు, సందర్శకులకు అనుమతి లేదు.మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలి.గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వం సూచించిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి.ఎగువ ప్రాంతాలలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉండడంతో జిల్లాలోని కల్వర్టులు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉంది.లోతట్టు, ముంపు ప్రాంతాలలో నివాసం ఉండేవారిని అప్రమత్తం చెయ్యాలి అని సూచనలు ఇచ్చారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడి, నవంబర్ 2వ తేదీ రాత్రి నుంచి 3వ తేదీ తెల్లవారుజాము మధ్య నెల్లూరు–ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండా లని జిల్లా ఎస్పీ తెలిపారు.













