ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 10:
హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ ప్రాంగణంలో కొత్తగా ఎంపికైన పోలీసు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సీవీ ఆనంద్, శివధర్ రెడ్డి, పలువురు డీఎస్పీలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ఎదురైన న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఈ నియామక ప్రక్రియ పూర్తయింది. కొత్తగా విధుల్లో చేరుతున్న వారికి వృత్తిపరమైన బాధ్యతలపై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు
ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..
సంక్లిష్టమైన పరిస్థితుల్లో డీఎస్పీల నియామకం చేపట్టాం..
నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈ ప్రభుత్వమే పూర్తి చేసింది..
2011లో గ్రూప్-1 నియామకాలు చేపట్టారు.. ఆ తర్వాత 2025 వరకు దాదాపు 13 ఏళ్లు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలు చేపట్టలేదు..
కొన్ని నెలలు ఆలస్యమైతేనే ఏళ్లు కోల్పోయామన్న బాధ అనిపిస్తుంది..
టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చినా ప్రశ్నాపత్రాలు, ఇతర అంశాల్లో జరిగిన గందరగోళం అందరికీ తెలుసు..
మీరు ఆ రోజు బాధితులు..
ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిర్లక్ష్యం చాలా మందికి కష్టనష్టాలు మిగిల్చింది..
నేను ముఖ్యమంత్రిగా కాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించాను..
టీజీపీఎస్సీలో గతంలో సభ్యులుగా పనిచేసిన వారిలో ఆర్ఎంపీ డాక్టర్లు లాంటి వాళ్లు ఉన్నారు..
ఉన్నత స్థాయిలో నియామకాలు చేపట్టే టీజీపీఎస్సీ బోర్డులో అంతకంటే కింది స్థాయి వాళ్లను, అవగాహన లేని వాళ్లను సభ్యులుగా నియమించడమే ప్రభుత్వ తప్పు..
రాజకీయ పునరావాసానికి కేంద్రంగా టీజీపీఎస్సీ తయారైంది..
యూపీఎస్సీ తీసుకుంటున్న విధానాలను అధ్యయనం చేసి టీజీపీఎస్సీని ఆ తరహాలో రూపొందించాం..
యూపీఎస్సీకి స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నాం.
టీజీపీఎస్సీ మొదటి ఛైర్మన్‌గా రిటైర్డ్ డీజీ మహేందర్ రెడ్డిని నియమించాం..
పోటీ పరీక్షలు నిర్వహించడంలో అనుభవం కలిగిన వాళ్లను, చిత్తశుద్ధి ఉన్నవాళ్లను బోర్డు సభ్యులుగా నియమించాం..
భవిష్యత్తు నిర్ణయించే వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లితే నియామకాల పట్ల అపనమ్మకం ఏర్పడుతుంది..
ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకటేశంను టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించాం..
ఈ ప్రాంతం, విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉన్న అధికారి ఛైర్మన్‌గా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది..
563 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 562 మంది జాయిన్ అయ్యారు..
112 మంది డీఎస్పీల నియామకం చాలా పెద్ద విషయం..
నియామకాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో పారదర్శకతను పాటించింది..
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారి పిల్లలు కూడా ఈ నియామకాల్లో ఉన్నారంటే మా పారదర్శకత అర్థమవుతుంది..
ఈ నియామకాల పట్ల కొందరు పని గట్టుకుని ఎన్నో ఆరోపణలు చేశారు..
అవినీతి జరిగిందని, కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు..
రాజకీయ ఆరోపణలు మాకు కొత్త కాదు.. కానీ మీకు చాలా ఆందోళన కలిగించాయి..
ఈ అవకాశం కూడా జారిపోతుందేమోనని ఆందోళన చెందారు..
డీఎస్పీల తరఫున సుప్రీంకోర్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లింది..
నిష్ణాతులైన న్యాయవాదులతో వాదించి డీఎస్పీల నియామకాన్ని సాధించాం..
నాలెడ్జ్, చిత్తశుద్ధి, అంకితభావం మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది..
మీ నేపథ్యాన్ని మరిచిపోవద్దు..
మన నేపథ్యాన్ని మరిచిపోతే మన హోదాకు న్యాయం చేయలేం..
మీరు ఏ ఉద్దేశంతో పోలీస్ శాఖలో చేరారో దాన్ని మరిచిపోవద్దు..
లక్ష్యం పెట్టుకుని ప్రయత్నం చేస్తే అసాధ్యం ఏదీ ఉండదు.. చరిత్రలో చాలా మంది ఉన్నారు..
లక్ష్యం పెట్టుకుని కష్టపడ్డారు కాబట్టే ఈ హోదాకు చేరుకున్నారు..
ఇక ముందు రెండో అధ్యాయం ప్రారంభం కాబోతుంది.. ఇది మీ జీవితాల్లో చాలా ముఖ్యం..
వచ్చే ముప్పై ఏళ్లు తెలంగాణ భవిష్యత్తును ఏ దిశగా నడిపించాలో అది మీ చేతుల్లోనే ఉంది..
ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే పెద్ద హోదా మీది..
మీ ఫీడ్‌బ్యాక్, నిర్ణయాలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారుతుంది..
మీరు నిటారుగా నిలబడి డ్యూటీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది..
నిజాయితీగా డ్యూటీ చేయాలి, బాధ్యతను గుర్తించి పనిచేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది..
ప్రజలకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకు వచ్చేది పోలీసు వ్యవస్థ..
తల్లిదండ్రుల కంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసు వ్యవస్థ..
సర్వం ఒడ్డి శాంతిభద్రతలను కాపాడారు కాబట్టే ప్రజలు పోలీసు వ్యవస్థను విశ్వసిస్తున్నారు..
అనేక మంది సీనియర్ పోలీసు అధికారులు నిక్కచ్చిగా పనిచేయడం వల్లనే సమాజంలో పోలీసు వ్యవస్థకు గుర్తింపు వచ్చింది.. దాన్ని మీరు కాపాడాలి..
మీ హోదాను ఎంత జాగ్రత్తగా ప్రజల కోసం వాడితే అంత బాగుంటుంది..
అతిగా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడితే దీర్ఘకాలికంగా ఉండదు..
సమస్యను పరిష్కరించాలంటే ఆ సమస్యను ముందుగా అర్థం చేసుకోవాలి..
సమస్యను వినాలి, అర్థం చేసుకోవాలి.. అప్పుడే పరిష్కారం పెద్ద విషయం కాదు..
సమస్య పరిష్కారంలో సమయం, రిసోర్సెస్, టెక్నికల్ సపోర్ట్ అత్యంత ముఖ్యం..
బాధితులు వచ్చినప్పుడు కూర్చోబెట్టి వాళ్లతో ప్రేమపూర్వకంగా మాట్లాడాలి.. అప్పుడే సమస్య అర్థం చేసుకోగలుగుతారు..
రాజ్యాంగం రాసే సమయంలో దేశంలో అత్యాచారాలు, హత్యలు, ఆహార కొరత అనే మూడు సమస్యలు అధికంగా ఉన్నాయి..
పీవీ నరసింహారావు ఓపెన్ ఎకానమీ తీసుకువచ్చిన తర్వాత ప్రపంచంలోని అన్ని సమస్యలు మన దగ్గరకు వచ్చాయి..
అందులో ముఖ్యమైనవి సైబర్ క్రైమ్..
వ్యక్తుల మధ్య పరిచయం లేకుండా, కనీసం చూడకుండా సర్వం దోచుకునే పరిస్థితి సైబర్ క్రైమ్‌లో ఉంది..
ఇప్పుడు నేరాలు, వాటి ప్రవృత్తి మారిపోయింది..
డ్రగ్స్ సరఫరాను నియంత్రించడంలో యుద్ధవీరులను ఇచ్చిన పంజాబ్ కూడా విఫలమైంది..
సిక్కు రెజిమెంట్‌లో ఇప్పుడు సిక్కులు లేరు..
బ్రిటీషర్లు కూడా భయపడిన సిక్కు జాతి డ్రగ్స్ విషయంలో నిర్వీర్యమైంది..
డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్‌ను తీసుకువచ్చి అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాం..
ఫుడ్ సేఫ్టీ, ట్రాఫిక్, డ్రగ్స్ కంట్రోల్, సైబర్ క్రైమ్‌ల కోసం సరికొత్త వ్యవస్థలను తీసుకువచ్చాం..
అవసరమైతే నూతన డీఎస్పీలను అధ్యయనం కోసం విదేశాలకు పంపిస్తాం..
విద్యా ప్రమాణాల అధ్యయనం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపిస్తున్నాం..
డీఎస్పీలు తమ ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెట్టాలి..
గరం, నరం, బేషరమ్ పరిస్థితి మీకు ఎదురుకావొద్దని నేను కోరుకుంటున్నా..















