ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 18:
బి ఆర్ ఎస్ అంటే భూ బకాసుర రాష్ట్ర సమితి అని,సిద్ది పేటకు పట్టిన చీడ, పీడ హరీష్ రావు అని టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టుసాయి తీవ్ర స్థాయి లో విమర్శించారు.గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ త్వరలో సిద్దిపేట కు హరీష్ రావు చీడ పీడ వదులబోతుందన్నారు.
S1,సిరిసిల్ల,S2 సిద్దిపేట కాంగ్రెస్ ఖాతాలోకి రాబోతున్నాయి.హరీష్ రావును ఓడగొట్టేది సిద్దిపేట ప్రజలే.సీఎం రేవంత్ రెడ్డి వస్తే మోసాలు,అక్రమాలు, భూ దండాలు బయట పడతాయో అని హరీష్ రావు లబోదిబో అని మొత్తుకుంటుండు .సిద్దిపేట లో నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు రాకుండా అడ్డుకుంటుండు.సిద్దిపేట లో హరీష్ రావు రైతుల భూములు గుంజుకుండు .సిద్ది పేటను నానా గోస పెట్టింది హరీష్ రావు, మాజీ IAS వెంకట్ రామిరెడ్డి 20సంవత్సరాలనుండి హరీష్ రావు ఎమ్మెల్యే గా ఉండి సిద్ది పేట ప్రజలకు చేసింది బోడి గుండు మాత్రమే.సిద్దిపేట ను రియలేస్టేట్ అడ్డాగా చేసుకొని దందా చేసిండు.మల్లన్న సాగర్ రైతులను హరీష్ రావు బేడీలు వేసి ఇబ్బందులు పెట్టిండు.మల్లన్న సాగర్, కొండపోచమ్మ ,రైతుల గోస హరీష్ రావు కు తగిలింది.తెలుగు రాష్ట్రాలలో హరీష్ రావు లాంటి కన్నింగ్ దొరకడు.2028 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు తాజా మాజీ సభ్యుడు కావడం ఖాయ మన్నారు.సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడం ఖాయం.సిద్దిపేట లో అభివృద్ధి కి మరో శఖం మొదలవుతుంది.1983 లో అనంతల మదన్ మోహన్ రావు తర్వాత మళ్ళీ సిద్దిపేట లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది .కారు,కమలం కాంగ్రెస్ సునామిలో కోట్టుక పోతుంది.వచ్చే ఎన్నికల్లో 153 సీట్లు ఉంటే 177 ,199 సీట్లు ఉంటే 100 సీట్లు కాంగ్రెస్ గెలవడం ఖాయ మన్నారు.















