EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కాళేశ్వరం ప్రాజెక్టు మూసివేసి నీళ్లు విడుదల చేయకుండా వ్యవసాయాన్ని ఎండబెట్టారు

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి నవంబర్ 18:

బంగారు తెలంగాణ కు బాటలు వేసిన కార్యసాధకులు కేటీఆర్, హరీశ్ రావు ల పై నోరు పారేసుకుంటే ఊరుకోం అని ఆలేరు మాజీ ఎం ఎల్ ఏ గొంగిడి సునీత హెచ్చరించారు.బుదవారం భువనగిరి బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మెఫియా సమావేశం లో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మూసివేసి నీళ్లు విడుదల చేయకుండా వ్యవసాయానికి ఎడ్డబెట్టిన మీరు కేసీఆర్ పై మాట్లాడటం సిగ్గు చేతన్నారు.పెద్దోళ్ల ను తిడితే గొప్పొల్లవుతారని అనుకుంటే సాధ్యం కాదన్నారు.కేటీఆర్ ను డ్రామా రావు అంటావా.. ఎంత ధైర్యం.అబద్ధాల కేటీఆర్ అంటే నిన్ను భూదందా ల అయిలయ్య అంటాం.ఆలేరు కు వెళ్ళు చూడు.. అండర్ పాస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.యాదగిరిగుట్ట అండర్ పాస్ బ్రిడ్జి ఎందుకు తొలగించలేదు.100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తానని హమీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.3 ఏళ్ల కాలంలో ఆలేరు కు చేసిన అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేయాలని సునీత డిమాండ్ చేశారు.అవగాహన లేక నోటికి వచ్చిన మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు.నిర్మల్ లో రైతు దీక్ష పెడితే ప్రభుత్వానికి వెన్ను లో వణుకు.ఏ గ్రామంలో రైతుకు రుణమాఫీ జరిగిందో వచ్చి చూపించాలని సవాల్ విసిరారు.రైతులను నట్టేట మంచి, రైతులు సంతోషంగా ఉన్నారు అంటే ఎట్లా ?

ఆలేరులో సాగు జలాల పరిస్థితి ఏంటి?

చెరువులు ఎండిపోతున్నాయి. తలాపున గోదావరి ఉంటే ఎందుకు నీళ్లు ఎత్తిపోసి ఆలేరు కు సాగు జలాల ఎందుకు తీసుకురాలేద అని ప్రశ్నించారు..కేటీఆర్ హరీష్ రావు పై విమర్శలు మానీ ఆలేరు అభివృద్ధిపై దృష్టి పెట్టు అని హితవు పలికారు .రూ. 73 వేల కోట్ల రైతు బంధు, 24 వేల కోట్ల రైతు భీమా కు బీ ఆర్ ఎస్ పార్టీ ఖర్చు చేసింది.లక్ష అరవై వేల కోట్ల నిధులు ఖర్చు చేసి రైతులకు సాగు జలాలు అందించింది ప్రభుత్వం బీ ఆర్ ఎస్.వ్యవసాయానికి 5 లక్షల కోట్ల ఖర్చు చేసి దేశానికే అన్నపూర్ణగా మార్చి ఈ రాష్ట్రాని అభివృద్ధి బాటలో నడిపిన ఘనత కేసీఆర్ డే నన్నారు.కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతామంటే అడ్డుకున్న నాయకుడు కేసీఆర్.మీరు వాడే ప్రతి సాగు జలాలు కాళేశ్వరం లో భాగమే.కేసీఆర్ సింహం లాంటి వ్యక్తిని గెలికితే మీ ఖర్మ.. మిమ్ముల్ని ఎవ్వరు కాపాడలేరు.కేసీఆర్ ఈ రాష్ట్రానికి జాతిపిత.ఎల్ నినో వస్తే అప్రమత్తమై చేపట్టాల్సిన ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.ప్రపంచమంతా ఎల్ నినో సమస్య ఉంది. కేవలం తెలంగాణ లోనే రాలేదు.పేద, మధ్య తరగతి కుటుంబాలు బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు.గతంలో రూ. 25 నుంచి 30 ఉంటే ఇప్పుడు కిలో బియ్యానికి రూ. 100 పెరిగింది.మహిళలకు మీరు ఎం చేశారు. హన్మకొండలో మహిళలకు వడ్డీ లేని రుణాలు కింద రూ. 13 వేల కోట్ల చెక్కు బౌన్స్ అయిన ఘటన మహిళలు మరిచిపోలేదన్నారు.ఆశా, ఎన్ హెచ్ ఎం, మధ్యాహ్న భోజన పథకం లో పనిచేసే మహిళలను ప్రభుత్వం మరిచిపోయింది.మహిళల ను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే నీ ఆలేరు నియోజక వర్గం ఎంత మంది మహిళలు కోటీశ్వరులయ్యారో చెప్పు అని నిలదీశారు.రైతును రాజు చేయాలని కేసీఆర్ పాలనలో 2023-2024 లో 59,89,000 హెక్టార్ల వ్యవసాయ భూమి సాగుకు వచ్చింది.టీ ఎస్ ఐ పాస్ కింద గత కేటీఆర్ పాలనలో రూ. 2,67,000 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ కు వచాయి. 2016 లో కేంద్ర ప్రభుత్వ బీ ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న సంగతి తెలుసుకొని మాట్లాడు.కేసీఆర్ పాలనలో 15,804 స్టార్టప్ ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి.హైడ్రా తో పేదల భూములు కబ్జా చేసి, బడాబాబులకు కొమ్ము కాసిన కాంగ్రెస్ సర్కార్ అని దుయ్యబట్టారు.రాజపేటలో డిస్ట్రిబ్యూటరీ కాలువ ఎందుకు పెండింగ్ లో పెట్టారు. చెరువులు మూసుకుపోతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నావు.మిషన్ భగీరథ పథకం ద్వారా ఉమ్మడి నల్లగొండ లో ఫ్లోరైడ్ తరిమి కొట్టింది కేసీఆర్..మీది ప్రజా పాలన ప్రభుత్వం కాదు.. ప్రజలను పీడించుకునే ప్రభుత్వము.కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను తొలగించాలనే కుట్ర సాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మారిస్తే రైతులు తరిమికొట్టడం ఖాయం.కేటీఆర్ రైతు గర్జన పేరిట ప్రజలకు ఒక భరోసా కల్పిస్తుంటే ఎందుకు భయం.కేటీఆర్, హరీష్ రావు ల పై ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నావో చెప్పాలి. పేర్లు మార్చే పనిని పక్కనబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగించి రైతులకు సాగు నీళ్ళివండి.మాట్లాడేటప్పుడు ఆలోచించి అవగాహనతో మాట్లాడు..అని గొంగిడి సునీత హితవు పలికారు.

Related News

Select the Topic
Scroll to Top