ఈతరం భారతం వేములవాడ తెలంగాణ నవంబర్ 18:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వివాదానికి దారితీశాయి. గర్భగుడి శిఖరాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.అభివృద్ధి పనులు ప్రారంభానికి ముందు గర్భగుడిని ముట్టుకోబోమని హామీ ఇచ్చి, ఇప్పుడు శిఖరాన్ని తొలగించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులను నిలదీశారు.మరోవైపు, గర్భగుడిపై ఉన్న శిఖరం దూరం నుంచి కూడా భక్తులకు స్పష్టంగా కనిపించేలా నిర్మించాలంటూ శృంగేరి పీఠం నుంచి ఆదేశాలు వచ్చాయని, అందులో భాగంగానే పనులు ప్రారంభించామని ఆలయ ప్రధాన అర్చకుడు శరత్ శర్మ వెల్లడించారు.















