ఈతరం భారతం న్యూఢిల్లీ నవంబర్ 22:
ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన గ్లోబల్ పీస్ ఆనర్స్ 2026 కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఘనంగా సత్కరించారు. గిరిజన, పేద పిల్లల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్న సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ఏక్నాథ్ షిండే, సునేత్ర అజిత్ పవార్, అనంత్ అంబానీ పాల్గొన్నారు. 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులకు సచిన్ భావోద్వేగ నివాళులర్పించారు.















