ఈతరం భారతం అమరావతి ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 22:
సర్పంచ్ ఎన్నికల వేళ అభ్యర్థుల హామీలు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. తనను గెలిపిస్తే పంచాయతీలో జన్మించిన ఆడపిల్లలకు రూ. 10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని అనంతపురం (D) నేమకల్లు పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థిని ప్రకటించారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, విద్యార్థులకు బస్సు సౌకర్యం తదితర హామీలు అమలు చేస్తానంటూ రూ. 10 బాండ్ పేపర్పై అగ్రిమెంట్ రాసిచ్చారు. నోటరీ సైతం చేయించి ప్రచారం నిర్వహిస్తున్నారు.















