ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 22:
సీనియర్ జర్నలిస్టు వనం వెంకటరమణ ఆదివారం సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మృతిపట్ల హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపింది. సీనియర్ రిపోర్టర్‌గా వృత్తిపట్ల అంకితభావంతో పనిచేసిన వెంకట రమణ ఎప్పుడూ చిరునవ్వుతో సహచరులను, పరిచయస్తులను ఆప్యాయంగా పలకరిస్తుండేవారు. ఆదివారం సాయంత్రం వరకూ అందరితో కలివిడిగా ఉన్న వెంకటరమణ.. ఆకస్మిక మరణాన్ని తోటి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన గతంలో ప్రజాశక్తి, నవతెలంగాణలో రిపోర్టర్ గా సబ్ ఎడిటర్ గా పనిచేశారు. వీ6 వెలుగు దినపత్రికతో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ లో రిపోర్టర్గా పనిచేశారు. ప్రస్తుతం తెలుగు ప్రభ రిపోర్టర్గా కొనసాగుతున్నారు. కాగా, వెంకటరమణ అంత్యక్రియలు.. సోమవారం అంబర్ పేట స్మశాన వాటిక లో మధ్యాహ్నాం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.















