EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

మూన్ పై మార్నింగ్ వాక్ చేయెుచ్చు!

హైదరాబాద్, డిసెంబరు 28 (ఈతరం న్యూస్)

తొందరలోనే మనం మూన్(చంద్రుడు)పై మార్నింగ్ వాక్కు వెళ్లి లంచ్కు ఇంటికి చేరుకోవచ్చట.  రష్యా స్పేస్ క్రాఫ్ట్ ఒకటి భూమిపై నుంచి బయలుదేరి మూడు గంటల్లోనే.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరింది. ఇంత రికార్డు వేగంతో వ్యోమగాములు ఐఎస్ఎస్‌కి చేరుకోవడం ఇదే తొలిసారి. 

దీనమ్మా జీవితం..

హైదరాబాద్ నుంచి పెద్దపల్లి జిల్లాలోని మా గూడెం పోవాలంటే తక్కువలో తక్కువ 5న్నర గంటలు పడుతుంది. దాంట్లో దాదాపు సగం టైంలోనే.. మనం అంతరిక్షంలోకెళ్లి చక్కర్లు కొట్టొచ్చన్నమాట. అంతకంటే అడ్వాన్స్డ్ విషయాన్ని.. ఒక పుస్తకంలో చదివాను. త్వరలోనే భారతీయులు భూ గ్రహాన్ని సగం రోజులోనే చుట్టి రావడం రొటీన్ జర్నీగా మారుతుందని రాశాడు రచయిత. స్పేస్ క్రాఫ్ట్లో భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడం.. అది కూడా ఉచితంగా అని నవలలో చెప్పినట్టు మన కళ్ల ముందే అందుబాటులోకి వస్తుందేమో..! 

ఇప్పటికే అంతరిక్ష పరిశోధనలు, ఫలితాల సాధనలో మనం తోపులుగా ఉన్నాం. రాకెట్లు, ఉపగ్రహాలను రోదసిలోకి పంపించడంలో మనది సూపర్ రికార్డ్. అంతే కాదు, రష్యా, అమెరికా, వంటి వస్తాదు దేశాలకే సాధ్యం కాని స్పేస్ ఫీట్లు ఎన్నో చేశాం. మెుదటి ప్రయత్నంలోనే ‘మంగళ్యాన్’ను అంగారకుడిపై దింపగలిగాం. ‘మిషన్ శక్తి’ ద్వారా ‘స్పేస్ వార్’కు శ్రీకారం చుట్టాం. శత్రువులను భూ, జల, వాయు తలాల్లోనే కాకుండా అంతరిక్షంలోనూ మట్టి కరిపిస్తున్నాం.

‘గగన్ యాన్’ ద్వారా మనుషులను అంతరిక్షంలోకి పంపించడం మెుదలుపెట్టాం.

మరో పక్క ప్రపంచంలో దాదాపు పదేళ్ల నుంచే ‘space tourism’ బాగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు సంస్థలెన్నో సామాన్యులను అంతరిక్ష యాత్రికులుగా రోదసిలోకి తీసుకెళ్లి వస్తున్నాయి. మన దేశం కూడా ఈ రేసులో జాయిన్ అయింది. ఇదంతా చూస్తుంటే  2052 నాటికి ‘space tourism’ కామన్ అయిపోవచ్చు. ఎవరైనా.. అంతరిక్షానికి హాఫ్ డేలోనే వెళ్లి రావొచ్చు.

ఆ నవలలో చెప్పినట్టు.. చందమామపై మనం కాలనీ కట్టడం, అక్కడ నివాసముండటం ఖాయమే!

పుస్తకంలో మరో విషయం.. ఇంకో పోస్టులో..

పుస్తకం ఎక్కడ  దొరుకుతుంది ?

ఆ వివరాలు  త్వరలో…             

              

        

Related News

Select the Topic
Scroll to Top