పాట్నా మార్చ్ 17 ఈతరం భారతం:
జనతా దళ్ యునైటెడ్ (JDU) పార్టీ బిగ్ షాక్ తగిలింది. మంగళవారం (మార్చి 17న) సీనియర్ నాయకుడు కె.సి. త్యాగి పార్టీకి గుడ్ బై చెప్పారు. అధినేత నితీష్ కుమార్ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజే త్యాగి పార్టీని వీడడంతో పార్టీలో కలకలం రేపుతోంది. జేడీయూ నుంచి బయటకు వచ్చిన త్యాగి.. వేరే పార్టీలో చేరతారా లేక సొంత పార్టీని ఏర్పాటు చేస్తారా? అనే విషయమై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.















