EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

నితీశ్‌ కుమార్‌ అవకాశవాద రాజకీయాలకు ఇది పరాకాష్ట : మండిపడ్డ రోహిణి ఆచార్య  

పాట్నామార్చ్ 5 ఈతరం భారతం:

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌పై ఆర్జేడీ మాజీ నాయకురాలు రోహిణి ఆచార్య మండిపడ్డారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మ అని విమర్శించారు. మిత్రులను మోసం చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారని ఆరోపించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఓటమి నేపథ్యంలో జరిగిన కలహాల వల్ల లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య ఆ పార్టీతోపాటు కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నారు.కాగా, నితీశ్‌ కుమార్ రాజ్యసభకు పోటీ చేయడంపై తాజాగా ఎక్స్‌ పోస్ట్‌లో ఆమె స్పందించారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మగా మారారని రోహిణి ఆచార్య విమర్శించారు. రాజకీయ భాగస్వాములను పదే పదే ‘ద్రోహం’ చేయడం వల్ల కలిగే పరిణామాలను ఆయన ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.మరోవైపు నితీశ్‌ కుమార్‌ పట్ల బీజేపీ చెడుగా ప్రవర్తించిందని, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయమని ఆయనను బలవంతం చేసిందని రోహిణి ఆచార్య ఆరోపించారు. నితీశ్‌ ప్రస్తుత రాజకీయ పరిస్థితికి ఆయనే కారణమని మండిపడ్డారు. నితీశ్‌ కుమార్‌ అవకాశవాద రాజకీయాలకు ఇది పరాకాష్ట అని, తగిన మూల్యం చెల్లించుకున్నారని ఎక్స్‌ పోస్ట్‌లో ఆమె విమర్శించారు

.

 

Related News

Select the Topic
Scroll to Top