EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

40 కి పైగా దేశాల కోళ్లు, గుడ్లపై సౌదీ బ్యాన్ లిస్టులో భారత్

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ ఫిబ్రవరి 26

సౌదీ అరేబియా  ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్లు మరియు ఇతర పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతిని తాత్కాలికంగా నిషేధించింది.ఈ జాబితాలో భారతదేశం కూడా ఉండటం భారత పౌల్ట్రీ రంగానికి పెద్ద దెబ్బగా మారింది. హైలీ పాథోజెనిక్ అవియన్ ఇన్ఫ్లుఎంజా (HPAI)తోపాటు ముఖ్యంగా H5N1 వంటి బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ ప్రకటించింది. ఇటీవల వివిధ దేశాల్లో నమోదైన అవియన్ ఫ్లూ ఔట్‌బ్రేక్‌లను సమీక్షించిన తర్వాత సౌదీ అరేబియా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, వాటర్ అండ్ అగ్రికల్చర్ (MEWA) ఈ నిషేధిత ప్రకటను విడుదల చేసారు. ప్రజల ఆరోగ్య సేఫ్టీ మాత్రమే కాకుండా తమ దేశీయ పౌల్ట్రీ రంగాన్ని వైరస్ ప్రమాదం నుంచి కాపాడడం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలియజేసారు.

Related News

Select the Topic
Scroll to Top