EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి..

ఈతరం భారతం ఆరోగ్యాంశం:

తెల్లనివన్నీ పాలుకావని.. వాటిలో సైతం కల్తీ ఉంటుందనే విషయం ప్రజలకు క్లియర్ కట్‌గా అర్ధం కావాలంటే పాలు నిజమైనవో.. కల్తీ జరిగిందనే దానిని గుర్తించేందుకు.. పలు సింపుల్‌ చిట్కాలున్నాయి.

వాసన, రుచి..

స్వచ్ఛమైన పాలు స్వల్ప తీపి వాసన కలిగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే క్రీమ్ రుచిని కలిగి ఉంటాయి. అలా కాకుండా పాలు చేదుగా లేదా వింతైన రసాయన వాసర కలిగి ఉంటే.. అది కల్తీ పాలుగా గుర్తించవచ్చు.

పాలలో పిండి లేదా.. ?

కొద్దిగా పాలు తీసుకోవాలి. అందులో ఒకటి లేదా రెండు అయోడిన్ ద్రావణం చుక్కలు వేయాలి. ఆ వెంటనే పాలు నీలి రంగులోకి మారితే.. అందులో పిండి లేదా స్టార్చ్ కలిపారని గుర్తించాలి. అలా కాకుండా పాలు సాధారణ తెలుపు రంగులోనే ఉంటే.. కల్తీ జరగలేదని నిర్ధారణకు రావాల్సి ఉంటుంది.

సర్ఫ్, సబ్బు, నూనెల కల్తీ..

పాలను బాగా మరిగించినప్పుడు.. అవి పసుపు రంగులోకి మారితే.. అందులో సర్ఫ్, సబ్బు లేదా నూనె పదార్థాలు కలిపారని భావించాలి. అదే స్వచ్ఛమైన పాలు మరిగించినప్పుడు రంగు మారదు. అలాగే పాలను సీసాలో వేసి బాగా కుదిపితే.. అధికంగా నురగ వస్తే తప్పకుండా కల్తీ జరిగినట్లు నిర్ధారించుకోవాలి.

గంజి పౌడర్ కలిస్తే..

5 మిల్లీ లీటర్ల పాలలో 2 స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం నీలి రంగులోకి మారితే.. పాలలో గంజి పౌడర్ కలిపినట్లు గుర్తించాలి.

యూరియా కలిపితే..

నీటిలో యూరియాను వినియోగించి కల్తీ పాలను సైతం తయారు చేస్తున్నారు. దానిని యూరియా స్ట్రిప్స్ ద్వారా గుర్తించాలి. ఈ స్ట్రిప్స్.. మందుల షాపుల్లో లభ్యమవుతాయి. అలా కాకుంటే.. పాలను వేడి చేసినప్పుడు ఆవిరిలో వచ్చే ఘన పదార్థాల వాసన ద్వారా సైతం గుర్తించవచ్చు.

పాలలో నీటికి కలిపారంటే ఇలా..

ఒక పలకను ఏటవాలుగా ఉంచాలి. దానిపై పాల చుక్కను జార విడవాలి. పాలు నెమ్మదిగా.. తెల్లని గీత లాగా కిందకు జారితే స్వచ్ఛమైనవని అర్థం. అలా కాకుండా చాలా వేగంగా జారితే మాత్రం పాలలో నీరు కలిపినట్లు గుర్తించాలి.

వేడి చేస్తే సరిగ్గా మీగడ కట్టదు..

స్వచ్ఛమైన పాలు కాచి.. చల్లార్చిన తర్వాత పైన మీగడ చిక్కగా అంటే మందంగా కడుతుంది. కానీ కల్తీ పాలు త్వరగా పాడవుతాయి. వేడి చేసినప్పుడు సరైన మీగడ కూడా రాదనే విషయాన్ని గమనించాలి..

 

Related News

Select the Topic
Scroll to Top