డిసెంబర్ 27 (ఈతరం న్యూ స్);వారం రోజుల నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితో ప్రజలు వణుకుతున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలోనే పొగ మంచు కమ్మేస్తుంది. ఉదయం ఎనిమిది గంటలైనా మంచు తెరలు వీడడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో మున్ముందు మరింత చలి పెరిగే అవకాశం లేకపోలేదు. ఉదయం జాగింగ్, వాకింగ్ వెళ్లాలంటే చర్మం పొడిబారి బిగుతుగా మారే అవకాశం ఉంటుంది. కాళ్లు పగుళ్లు, పెదాలు తడారడం లాంటి సమస్యలు వస్తాయి. ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులు కలుగుతాయి. చలికాలంలో వివిధ రుగ్మతలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే మంచిదని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు లిల్లీ మేరి సూచిస్తున్నారు.నూలు దుస్తులు: చలిపులి నుండి రక్షణ పొందాలనుకునే వారు ఈ కాలంలో నూలు దుస్తులను ధరిస్తారు. ఈ దుస్తులు చలి నుంచి సంరక్షిస్తుంది. రాత్రివేళ తమ పనులు ముగించుకుని ఇంటికి వెళ్ళావారు, పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు నూలు దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. బైకులపై ప్రయాణించేవారు మంకీ క్యాప్స్, కాళ్లకు షూ, తలకు హెల్మెట్, చేతులకు గ్లౌజులు ధరించాలని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు లిల్లీ మేరి తెలిపారు.గుండె జబ్బులు ఉన్నవారు: చలికాలంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అనునిత్యం వైద్యుల పర్యవేక్షణలో అందుబాటులో ఉండాలి. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు వాకింగ్ చేయవద్దు. చలిలో ఎక్కువసేపు తిరగటం మంచిది కాదు. దీనివల్ల రక్తనాళాలు సంకోచించి గుండెకు సంబంధించిన సమస్యలను మరింత పెంచుతాయి. సాధారణ వ్యక్తులకు కూడా సమస్యలు ఉత్తమవుతాయని లిల్లీ మేరి పేర్కొన్నారు.ఆస్తమా ఉన్నవారు: శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా తదితర వ్యాధిగ్రస్తులు చలికాలం పూర్తి అప్రమత్తంగా ఉండాలి. నిత్యం వాడే మందులను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. సిగరెట్ అలవాటు మానివేయాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. చల్లని గాలికి ఎక్కువగా తిరగరాదు. శ్వాస నాళాలు మూసుకోకుండా వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. ఇన్హేలర్, నెఫ్లేజర్ వంటి వాటిని కూడా వాడాలి. ముక్కు భాగంలో ఇన్ఫెక్షన్ ఎక్కు వై తెమడ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు సిరప్పులు తాగాలని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు లిల్లీ మేరి సూచించారు.చేతులు పాదాలు పగిలితే: చేతులు పాదాలు పగిలితే కొంత సమయం ప్రత్యేకంగా కేటాయించి గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కొద్దిసేపు కాలి పాదాలను ఆ నీటిలో ఉంచాలి. ఆ తర్వాత కాలి పాదాలను శుభ్రమైన పొడి బట్టతో తుడిచి వైద్యులు సూచించిన క్రీముతో పాదాలకు రుద్దితే పగుళ్లు తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా అరచేతులు, వేళ్ళ సందుల్లో పగుళ్లు ఉంటే కూడా అదే పద్ధతిని పాటించాలని లిల్లీ మేరి అన్నారు.చలికాలం..
పరీక్షాకాలం: శరీరంలో తేమ శాతం తగ్గటం వలన మహిళల హార్మోను సమస్యలు ఉత్పన్నమవుతాయి. మధుమేహం, థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు చలికాలం పరీక్ష కాలం. ఇలాంటి వారికి అరచేతులు పగిలిపోయి చేతులు పొడిబారుతుంటాయి. సున్నితంగా ఉండే శరీరం త్వరగా పొడిబారి పోతుంది. పాదాలు, పెదవులు పగులుతుంటాయి. సబ్బులు, షాంపూలు, దుస్తుల విషయములో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కళ్ళు సున్నితంగా ఉండటం వల్ల అక్కడ శరీరం పొడిబారుతుంది. చేతులు త్వరగా డ్రై అవుతాయి. ఎప్పటికప్పుడు ముఖాన్ని శుభ్రపరుచుకునేందుకు క్లీనింగ్ మిల్క్ పౌడర్ ను ఉపయోగించుకోవాలని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు లిల్లీ మేరి తెలిపారు.ఆస్తమా బాధితులకు సూచనలు: ఇతరులకు దగ్గు, జలుబు ఉంటే వారికి దూరంగా ఉండాలి. చలిగా ఉన్న సమయంలో బయటికి రాకూడదు. నిద్ర లేవగానే చల్లటి ప్రదేశంలోకి వెళ్ళకూడదు. మందులు వాడే రోగులు నిర్లక్ష్యం వహించవద్దు. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉంటే వైద్యుని వెంటనే సంప్రదించాలి. తెల్లవారుజామున, సాయంత్రం, రాత్రిపూటలో స్నానం చేయొద్దు. వాతావరణ కాలుష్య ప్రాంతాల్లో తిరగవద్దు. పొగ తాగే వారి వద్ద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
స్వైన్ ఫ్లూ వ్యాధితో అప్రమత్తం—: వాతావరణం లో ఒకసారి గా మార్పులు రావడంతో పల్లెల్లో, పట్టణాలలో వాతావరణం చల్లబడటంతో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తుంది. రాష్ట్రంలో అక్కడక్కడ స్వైన్ ఫ్లూ వ్యాధుల కేసులు నమోదు అవుతున్నాయి. చలికాలం కంటే ముందుగానే స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది . మధుమేహము, రక్తహీనత, గుండె జబ్బులు, హెచ్ఐవి, నిమోనియా వంటి వ్యాధులు ఉన్న వారిలో ఈ వైరస్ శక్తివంతంగా ఉంటుంది. చిన్నారుల్లో, గర్భిణీలలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. త్వరగా స్వైన్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉంటుంది. కావున ఈ వ్యాధి పట్ల చిన్న పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చల్లటి గాలిల్లో వారు తిరగకుండా జాగ్రత్త పడుతూ, వారికి స్వెటర్లు వేయాలని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు లిల్లీ మేరి సూచిస్తున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు తప్పకుండా ముఖానికి మాస్కులు ధరించాలి. లేని పక్షంలో ఈ వ్యాధి మరొకరికి సోకే అవకాశం ఉంటుంది అని లిల్లీ మేరీ తెలిపారు.
పాటించాల్సిన జాగ్రత్తలు: వేడి నీటితో స్నానం చేయకూడదు. జుట్టును వదులుగా ఉంచుకోవాలి . సబ్బు కంటే శనగపిండి, సుండి పిండి ఉపయోగించాలి. సబ్బు వాడటం తప్పనిసరి అయితే గ్లిజరిన్ సబ్బులను మాత్రమే వాడాలి. స్నానం చేయగానే వెంటనే పొడి గుడ్డతో తుడుచుకొని మసాజ్ చేసుకోవాలి. వాహనాలు నడిపేవారు చేతులకు గ్లౌజులు, కాళ్లకు షూ, స్వెటర్లు, హెల్మెట్ ఉపయోగించి చలికాలంలో జాగ్రత్తలను పాటించాలి.
చలికాలంలో శరీరానికి మాయిశ్చరైజర్లు, క్రీం బేస్డ్ వ్యాజిలిన్ లు ఉపయోగించడం మంచిది. వీటిని ముఖానికి, చేతులకు, కాళ్లకు రాసుకోవడం వల్ల చర్మo మృదువుగా ఉంటుంది. ఎన్నో రకాల మాయిశ్చరైజర్లు అందుబాటులో ఉన్నాయి. రోజు పడుకునే ముందు నిద్ర లేవగానే మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. చలికాలం వేధించే మరో సమస్య పెదాలు పగిలి రక్తం కారటం. అందుకే పెదాలకు వ్యాజిలిన్, లిప్ గార్డ్ లాంటివి రాసుకోవాలి అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు లిల్లీ మేరి తెలిపారు









