సిద్దిపేట డిసెంబర్ 9 (ఈతరం ఇండియా న్యూస్ );రక్త పంపిణీ లేదా బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ అంటే రక్తము లేదా రక్త ఉత్పత్తులను ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇస్తారు. రక్త కణాలు లేదా రక్త ఉత్పత్తులు తీవ్రంగా నష్టపోయినప్పుడు బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ అవసరం అవుతుంది. తీవ్ర రక్తస్రావం జరిగితే అవసరమవుతుంది. శస్త్ర చికిత్సలు చేసే సమయంలో రక్తస్రావం జరుగుతుంది. రక్తహీనత కూడా ఏర్పడుతుంది. మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల నుంచి బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ జరిగే సమయంలో పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలను చాలా రోజుల ముందే నిర్వహిస్తారు. సేకరించిన రక్తాన్ని ప్రీజర్వు చేస్తారు. ఈ ప్రోటోకాల్ హాస్పిటల్ లోని రక్త నిధి కేంద్రంలో జరుగుతుంది.
సురక్షితమైన బ్లడ్ ప్రొడక్ట్స్ మీ సొంత రక్తం నుంచి సేకరించడం ఒక పద్ధతి. ట్రాన్స్ ఫ్యూజన్ జరిగితే మాత్రం తక్కువ రిస్క్ తో గండం నుంచి బయటపడగలుగుతాము. కొన్ని శస్త్ర చికిత్సలకు మాత్రమే ఇటువంటి సౌలభ్యం ఉంది. మీరు గనక బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ నిరాకరిస్తే మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. మీ పిల్లల ఆరోగ్యము వైద్య సంరక్షణ ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుందని లిల్లీ మేరి అన్నారు. మీ రక్తాన్ని మాత్రమే బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ లో వాడితే మాత్రం ఆటో లాగాస్ బ్లడ్ అని అంటారు. బ్లడ్ బ్యాంకులు మీ రక్తాన్ని సేకరించి నిల్వచేస్తాయి. శాస్త్ర చికిత్స తర్వాత ఈ రక్తం అవసరం అవుతుందని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి పేర్కొన్నారు.
బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ లో రకాలు ఉన్నాయి. రెడ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ ఒకరకము. ఇది ఎక్కువగా జరుగుతుంది. ఈ రక్త కణాలు ఎక్కువగా ఆక్సిజన్ ను సేకరిస్తాయి. ఈ కణాలు ఆక్సిజన్ ను ఊపిరితిత్తులకు, శరీరంలోని ఇతర అవయవాలకు ఆక్సిజన్ చేరవేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ ను, ఇతర వ్యర్థ పదార్థాలను విసర్జించడానికి దోహద పడుతుంది. ఎర్ర రక్త కణాలు తగ్గితే మాత్రం ఎనీమియా ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ ఐరన్ అధికంగా ఉన్న ప్రోటీన్. ఈ ప్రోటీన్ వల్లే ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి సేకరిస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువైతే ఎనీమియా ఏర్పడుతుందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి తెలిపారు.
ప్లేట్లెట్స్ క్లాటింగ్ ఫ్యాక్టరు ట్రాన్స్ ఫ్యూజన్: ప్లేట్ లెట్స్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ట్రాన్స్ ఫ్యూజన్ వల్ల రక్తస్రావాన్ని నిరోధిస్తుంది. అంతర్గతంగా రక్తస్రావం జరిగితే ఇలా జరుగుతుంది కొన్ని అనారోగ్యాల వల్ల మీ శరీరము ప్లేట్లెట్లను తయారు చేసుకోలేక పోతుంది. మీరు తరచుగా ట్రాన్స్ ఫ్యూజన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమంగా ట్రాన్స్ ఫ్యూజన్ జరిగితే రక్త ఉత్పత్తులు మన శరీరంలో ఉండి ఆరోగ్యంగా ఉండగలుగుతామని లిల్లీ మేరి తెలిపారు.
ఉదాహరణకు మీరు గనక హిమోఫీలియా ఉంటే మాత్రం ప్రత్యేక క్లాటింగ్ ఫ్యాక్టర్స్ రీప్లేస్ చేయాలి. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు ఈ పద్ధతి ఉంది. హిమోఫీలియా అనేది చాలా అరుదైనది . రక్తస్రావ రుగ్మత ఇది. సాధారణంగా రక్తము క్లాట్ కానప్పుడు దీనిని ఎంచుకుంటారని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి పేర్కొన్నారు.
ప్లాస్మా ట్రాన్స్ ఫ్యూజన్: ప్లాస్మా అనేది మీ రక్తంలో ద్రవపదార్థంలో ఉండే పదార్థము. దీనిలో ఎక్కువగా నీరు ఉంటుంది. దీనిలో కూడా ప్రోటీన్ ఉంది. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కు కూడా ఉంటాయి. అలాగే హార్మోన్స్, విటమిన్స్, కొలెస్ట్రాల్, చక్కెర, సోడియం ,పొటాషియం, కాల్షియం ఉన్నాయి. మీరు గనుక తీవ్రంగా కాలిన గాయాలకు గురైతే కాలయ వైఫల్యం చేకూరుతుంది . తీవ్ర ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు ప్లాస్మా ట్రాన్స్ ఫ్యూజన్ అవసరం అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి పేర్కొన్నారు.




