బాసర నవంబర్ 20 (ఈతరం భారతం);శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపములో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమము( కోటి పార్థివలింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము ) మాసో త్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమములు, అధ్యాత్మిక ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవం గా జరిగినవి. ముందుగా లక్ష్మీ గణపతి, వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య, కోటి పార్థివ లింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగములకు మహా రుద్రాభిషేకము , కుంకుమార్చన ,గణపతి, నవగ్రహ ,రుద్ర ,సరస్వతి హోమములు, భూదాన సంకల్ప పూజ, మరియు అన్నప్రసాద వితరణ ఘనంగా జరిగింది..సాంస్కృతిక కార్యక్రమములో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన నాట్య గురువులు, శ్రీ సాయి కృప మ్యూజిక్ అండ్ డాన్స్ హబ్బిస్ స్కూలు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పాలకుర్తి వసంత లక్ష్మీ శిష్య బృందం చేసిన నాట్య ప్రదర్శన మరియు భక్తి సంగీత విభావరి శ్రోతలను ఆకట్టుకున్నది. ఈ సందర్భమూ గా మానస ఆర్ట్స్ థియోటర్స్ కార్యదర్శి మరియు కవి రచయిత శ్రీ రఘు శ్రీ, కి,సృజన, స్పందన, ఆర్తన , సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంజనా చౌదరి కి, మరియు సంగీత,నాట్య గురువు శ్రీ పాలకుర్తి వసంత లక్ష్మీ లకు ఉత్తమ ఆధ్యాత్మిక భక్తి సేవా పురస్కారము శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి వ్యవస్థాపక అధ్యక్షులు శివ శ్రీనిర్మల సంధ్య అంబికానాథ శర్మ దంపతులు అందజేసినారు. ఉత్తమ ఆధ్యాత్మిక సేవ పురస్కార గ్రహీత మానస ఆర్ట్స్ థియోటర్స్ కార్యదర్శి రఘు శ్రీ కవి, రచయిత సభలో మాట్లాడుతూ బాసర సరస్వతి క్షేత్రము లో ఈ పురస్కారం తీసుకొోవడము ఆనందము గా ఉన్నదని మరియు శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమములో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రతి నెల మాసోత్సవము భాగము గా పూజ కార్యక్రమములు, సంగీత, సాహిత్య,నృత్య, ధార్మిక , ఆధ్యా త్మిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు.హైదరాబాద్ వాస్తవ్యులు భౌతిక శాస్త్ర అధ్యాపకులు వెంకటేష్ , సతీష్ చంద్ర, ఎస్పీ కోటేశ్వర్, సుబ్రమణ్యం, బాల్రాజ్, యం మాధవి, కె వరలక్ష్మి ,అనూషా తదితరులు పాల్గొన్నారు.