పెద్దపల్లి, మే 22 (ఈతరం భారతం న్యూస్ ); : జిల్లాలో అక్రమంగా ఇసుక, ఇతర గనుల మైనింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్రమ మైనింగ్ ను అరికట్టేందుకు గట్టి నిఘా పెట్టి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, ఇతర గనుల నుండి అక్రమంగా తరలించడం చట్ట ప్రకారం నేరమని, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్, మైనింగ్, నీటిపారుదల, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అక్రమ మైనింగ్ నివారణకు కృషి చేయాలని అన్నారు.మానేరు నది వద్ద ఇసుక మైనింగ్ కు జిల్లాలో ప్రస్తుతం ఎటువంటి అనుమతి లేదని, మానేరు నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. మానేరు నది పరివాహకం వద్ద ఇసుక మైనింగ్ పట్ల ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అప్పటి వరకు అక్కడి నుంచి ఇసుక తీసుకువెళ్లడానికి వీలు లేదని కలెక్టర్ తెలిపారు. అక్రమ మైనింగ్, ఇసుక రవాణా చేసే వాహనాల యజమానులు, డ్రైవర్లు, ఇతర సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో అక్రమ మైనింగ్, ఇసుక రవాణా పట్ల ప్రజలు సెల్ నెంబర్ 7995070699 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తె
పారు.