రంగారెడ్డి: నవంబర్ 25(ఈతరం ఇండియా న్యూ స్):ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోహెడ, ఉమర్‌ఖాన్ గూడ (సంఘీనగర్) లలో పర్యటించారు. ఈ సందర్భంగా నోముల దయానంద్ గౌడ్ మాట్లాడుతూ బీజేపి అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని, మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు, ఉజ్వల లబ్దిదారులకు ఏడాదికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, రైతులకు వరి పంటకు క్వింటాల్‌కు మద్దతు ధరపై వెయ్యి రూపాయల బోనస్, రైతులకు పాలిచ్చే ఆవును ఉచితంగా అందిస్తామని ఇప్పటికే బీజేపి మానిఫెస్టోలో ప్రకటించామని పునరుద్ఘాటించారు. సామాన్య ప్రజల సంక్షేమాన్ని, అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇప్పుడు బిజేపికి ఓటు వేసి గెలిపించుకోవాలని తెలిపారు. ఇబ్రహింపట్నంలో కబ్జాదారుల భరతం పట్టాలంటే బిజేపికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో అర్జున్ రెడ్డి, నిట్టు శ్రీశైలం యాదవ్, సింగిల్ విండో చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బూర మహేష్, కౌన్సిలర్ శ్రీలతా అనిల్ కుమార్, నల్ల మల్లారెడ్డి, నల్ల బాల్ రెడ్డి, తూళ్ల సుధాకర్, వనమాల లక్ష్మారెడ్డి, బండారు దానయ్య, దానిష్, మున్న తదితరులు పాల్గొన్నారు.