చేవెళ్ల(హైదరాబాద్) ఆగష్టు 22 (ఈతరం భారతం);మహిళా శక్తిని చాటుతూ తెలంగాణలో మార్పు తీసుకురావాలని, రానున్న కాలంలో బీజేపీని గెలిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు.. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో బీజేపీ మహిళా సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాంచందర్ రావు గారు మాట్లాడుతూ మహిళా సమ్మేళనానికి ఇంత పెద్దఎత్తున మహిళలు సభకు తరలివచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.పర్యటనలో భాగంగా గ్రామంలో మహిళా రైతు కూలీలను కలిసి, “5 కిలోల ఉచిత బియ్యం ఎవరిస్తున్నారు?” అని అడగగా… ప్రతి ఒక్కరూ “మోదీ గారు” అని సమాధానం ఇచ్చారు.ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, ముద్రా రుణాలు వంటి పథకాల ద్వారా మహిళలకు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది.మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం, ఆడబిడ్డల పెళ్లికి రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పింది. 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ వాగ్దానాలు అమలు కాలేదు.రైతులకు రైతుభరోసా కూడా ఇవ్వడం లేదు.త్వరలో సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలకు బుద్ధి చెప్పేలా, నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతను, చేస్తున్న సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీని గెలిపించాలి.దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళేది మహిళలే.మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.ప్రధానమంత్రి జన్ ధన్ యోజనతో మహిళలకు బ్యాంక్ ఖాతాలను ప్రారంభించింది.చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించింది.గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేయడం ద్వారా మహిళా శక్తికి గౌరవం ఇచ్చింది.ఉజ్వల యోజనతో పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది.బేటీ బచావో, బేటీ పడావో కింద బాలికల రక్షణ, విద్యా ప్రోత్సాహం అందిస్తోంది. ముద్రా యోజన ద్వారా మహిళలకు పూచీకత్తు లేకుండా వ్యాపార రుణాలు అందజేస్తోంది.డప్ ఇండియా మిషన్ – మహిళా వ్యాపారవేత్తలకు పెట్టుబడి కోసం రుణాలు మంజూరు చేస్తోంది.ముద్రా యోజన కింద సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారాలు చేసే మహిళలకు రుణాలు మంజూరు చేస్తున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు.కేవలం RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అది కూడా బస్సుల సంఖ్య తగ్గించి, ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోంది.కాబట్టి మహిళా శక్తిని చాటుతూ తెలంగాణలో మార్పు తీసుకురావాలి. రానున్న కాలంలో బీజేపీని గెలిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.














