సిద్దిపేట, ఏప్రిల్ 07 (ఈతరంభారతం): ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యానికి మించిన సంపద లేదని జడ్జి స్వాతిరెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకోని న్యాయసేవాధికార సంస్థ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఇవాళ ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా జడ్జి స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులను చేసుకోవచ్చని..ప్రతి ఒక్కరు ఆహార నియమాలు పాటిస్తూ యోగా, వ్యాయమం చేయాలని సూచించారు. అంతకు ముందు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన ఆహారపు నియమాలను, జాగ్రత్తలను వివరించారు.న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు వైద్య శిబిరాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలను చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు మిలింద్ కాంబ్లె, చందన, తరణీ, సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెస్‌డెంట్ సీహెచ్ జనార్థన్‌రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
