EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదు: మంత్రి పొన్నం

ఈతరం భారతం హుస్నాబాద్ జనవరి 10

సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తాంటే తాను ఊరుకోనని హరీష్ రావు హెచ్చరించిన సందర్భంగా పొన్నం కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ ప్రభుత్వంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని, హస్నాబాద్ మండల ప్రజలు సిద్దిపేటలో ఉండాలను కోవడం లేదని, కరీంనగర్ జిల్లాలో కలపాలని కోరుతున్నారన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేశారని, ప్రజల నుంచి వినతులు కూడా పట్టించుకోలేదన్నారు. పలు జిల్లాల హద్దులు మారుతాయని జిల్లాల పేర్లు మారవని స్పష్టం చేశారు. ప్రజల బలమైన ఆకాంక్షల మేరకే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని పొన్నం స్పష్టం చేశారు. ఆందోళనతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయవద్దని హరీష్‌రావుకు పొన్నం చురకలంటించారు. సిద్దిపేట జిల్లా రద్దు చేస్తామంటే ఊరుకోమని, తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోపం సిద్దిపేట జిల్లా చూపించడం సరికాదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top