ఈతరం భారతం ప్రత్యేక వ్యాసం….
ప్రతి సంవత్సరం భాద్రపదంలో వచ్చే మహాలయ పక్షాలకు హిందువుల సంస్కృతి-ఆచారాలలో విశిష్టమైన స్థానమున్నది. స్మృతి కౌస్తుభంలో ఈ విశేషమైన పితృ పక్షం భాద్రపద బహుళ పాడ్యమి నుంచి ఆశ్వయుజ పాడ్యమితో 15 రోజులు ముగుస్తుందని చెప్పబడింది. ఇది వేదకాలం నుంచి కొనసాగుతున్న సదాచారం.
మనలో చాలా మంది గయా శ్రాద్ధం పెట్టాం కదా అని వార్షిక తద్దినాలు పెట్టడం మానేస్తున్నారు. అది శాస్త్ర సమ్మతం కాని విషయమని గ్రహించాలి. ఏటా తద్దినం పెట్టడం వలన పితరుల ఆశీర్వాద బలం వలన జాతకుని అయుష్షు పెరుగుతుందని చాలా మందికి తెలియదు. అందుకే వారి కోసం కాకున్నా కర్త తన ఆరోగ్య-ఆయుష్షుల కోసమైనా వార్షిక శ్రాద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానరాదు. వార్షిక శ్రాద్ధము పెట్టని కర్తకి, అతడి సంతానానికి ఆయుష్షు-ఆరోగ్యము రెండూ సరిగా ఉండవు.సాధారణమైన శ్రాద్ధదినానికి వీటికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. సాధారణ శ్రాద్ధములో మూడు తరాలకి చెందిన పితృవులకి మాత్రమే శ్రాద్ధభోజనం దక్కుతుంది కానీ మహాలయ పక్షాల లో చేసే శ్రాద్ధ కర్మవలన కర్తకి అతడి భార్యకు సంబంధించిన ఏడు తరాల పితురులు మాత్రమే కాక, కర్త –అతడి భార్య తాలూకు గతించిన గురువు లకు, బీరకాయ పీచు సంబంధం కలిగిన పితరులకు, అనాధ మరణం పొందిన కర్తకి సంబంధం లేని పితరులకు సైతం శ్రాద్ధ ‘కావ్యము’ పితరులకు ఇచ్చే పిండాన్నమును గవ్యము అంటారు, దేవతలకు ఇచ్చే వాటిని ‘కావ్యము’ అని అంటారు, అందుతుంది. కనుకనే కొంచం శ్రమ అయినా మహాలయపక్షాలలో శ్రాద్ధకర్మను చేసి తీరాలి అని శాస్త్రం కట్టడి చేస్తోంది.
ఒకప్పుడు అమృతమథనం జరగక పూర్వం ఒక భాద్రపద బహుళ పాడ్యమి నాడు మొదలైన దేవాసుర యుద్ధంలో అనేక మంది దేవతలు మరణిం చారు. ఈ యుద్ధంలో దేవతల తరపునుంచి అనేక మంది ఋషులు, పుంగవులూ కూడా పాల్గొని ప్రాణాలు విడిచారు. కృష్ణపక్ష అమావాస్య నాటికి ఆ యుద్ధం ముగిసి అసురులు విజేతలుగా నిలిచారు. యతులు, ఋషులు, దేవతలు మరణించిన ఈ పదిహేను రోజుల పక్షము యుద్దపు దినాలను అప్పట్లో యతి మహాలయమని, శస్త్రహత మహాలయమని పిలిచారు. నాటి నుంచి మహాలయపక్షము ఒక ఆచారంగా, యుగ ప్రారంభం-యుగాంతము మధ్య జరిపే ‘షణ్ణవతి’ అనబడే 96 రకాల శ్రాద్ధ కర్మ దినాలలో ఒకటిగా చేర్చ బడటం జరిగింది. ఆ విధంగా మహాలయ పక్షపు కర్మలు మన నైమిత్తిక కర్మలలో ఒక ప్రధాన భాగమైనాయి.
పితృవులు మన మనోజ్ఞాపకాలలోనే కాక మన భూ-కాలం లో కూడా సంచరిస్తారు. వివాహం చేసుకొని సంతానవంతులు అయ్యేది కూడా పితృవుల ఋణం తీర్చుకోడానికే!
మనుస్మృతి అధ్యాయం ఒకటి, శ్లోకం 66 ఇలా అన్నది.
“పిత్రే రాత్రాహానిమాసః, ప్రవిభాగస్తు పక్షయోః
కర్మచేష్టా స్వహాః, కృష్ణః, శుక్లస్వప్నాయ శర్వరీ”….
అంటే కృష్ణ పక్షము వారికి పగలు, శుక్ల పక్షము రాత్రి, వారికి ఇష్టమైన తిథి అమావాస్య ఎందుకయ్యింది అంటే అది వారికీ పనులు చేసుకునే పగటికాలం మాత్రమే కాదు సూర్య చంద్రులు కలిసే తిథి కూడా. అంటే సూర్యుడైన పర మాత్మ- చంద్రుడైన జీవాత్మలు ఏకం అయ్యే తిధి. అంటే కర్త తన మనసును జీవాత్మ చనిపోయిన పితరుని శ్రాద్ధ దినానికి ముందు రోజు నుంచే తలుస్తూ ఉండాలని, పితృవుల లోకంలో శుక్లపక్షంలో సూర్యుని కాంతి సోకదు కనుక అది వారికీ రాత్రి. దీనికి భిన్నంగా కృష్ణపక్షంలోని 15 రోజులూ ఆ లోకం లో సూర్యుని వెలుగు ప్రసరిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి… అమావాస్య లోని మన పగలు 12 గంటల సమయం పితృవుల లోకంలో మధ్యాన్నమ్ అపర్ణాహం. కనుక శ్రాద్ధం అపర్ణాహం వచ్చిన తరువాతనే భోక్తలకి భోజనం వడ్డిస్తారు.
పితరులు ఎక్కడ నివశిస్తారు?…
“ఉదన్వతీ ద్యౌరవమా, పీలుమతీతి మధ్యమాஉ.తృతీయా హాప్రద్యౌరితి, యస్యాం పితరే ఆసతే”
అధర్వణవేదం, 18-2-2 అధర్వణవేదం 18-2-2 మంత్రం ప్రకారం
భూమిపై భాగం మూడు విభాగాలుగా ఉంది. ఇందులో మొదటి భాగం ‘ఉదన్వతి’ అంటే వర్షాలు కురిపించే మేఘాలు ఉండే భాగం. రెండోవది ‘పీలుమతి’ అంటే సూర్యుని కిరణాలలోని ‘ఫోటా నులు’ మాత్రమే ఉండే భాగం. ఇది పసుపు రంగులో ఉండ టానికి కారణం ఫోటానుల రంగు పసుపు కావడమే. ఇక్కడ జల రేణువుల ఆనవాళ్లు మచ్చుకైనా ఉండవు. దీనిపైన ఉండే భాగం పేరు ‘ప్రద్యౌ’. ఇది తెల్లని నక్షత్ర కాంతి కలిగిన తేజో మండలం. ఇందులోనే మన పితరులు నివశిస్తుంటారు. ఇందుకు అధర్వణ వేదంలోని ‘విధూర్ధ్వభాగే పితరోవసంతి’ అనే వాక్యం ప్రామాణికముగా నిలుస్తోంది.
“యే శతం మనుష్యాణామానందా:సఏకః,
పిత్రూణాం జితలోకలోకానామానందః”
బృహదారణ్యకోపనిషత్లోని 4-3-33 మంత్రం.
అంటే మనం వందసార్లు ఆనందిస్తే పితరులకు అది ఒక ఆనందంతో సమానం. ఇందులో ‘జితలోక’ అంటే చంద్రుని కంటే పైన ఉండే భాగమని అర్ధం. అంటే తారా మండలము పితరులు ఉండే స్థానం అని ఈ ఉపనిషత్ స్పష్టం చేస్తోంది.
భోక్తలుగా విప్రులే ఎందుకు?
దేవతా యజ్ఞంలో కానీ, పితృదేవత తంతులో కానీ కేవలం బ్రాహ్మణుల ద్వారా మాత్రమే హవ్య-కావ్యములు అనే ఆహా రాన్ని స్వీకరిస్తారు. ఇందుకు ప్రామాణికం మనకి మనుస్మృతి, అధ్యాయము-1, శ్లోకం 95లో కనిపిస్తోంది.
అది ఇలా అంటోంది..
“యస్యాస్యేన సదాశృన్తి,హవ్యాని త్రిదివౌకసః కవ్యానిదైవ పితరః, కిం భూత మధికం తతః”
అధర్వణ వేదం4-34-8 /9-5-19మంత్రాలు సైతం దీనిని బలపరుస్తున్నాయి. అసలు భోక్తలు తాము భుజించిన శ్రాద్ధ భోజనాన్ని ఏ విధంగా మన పితరులకు చేరవేస్తారు అన్నదే ఇక్కడ అసలైన శాస్త్రీయ మైన సందేహం. బ్రాహ్మణుల జీర్ణకోశంలోని వైశ్వానర అగ్ని ఎవరో కాదు సాక్షాత్ ఆ అగ్ని దేవుడైన హవ్యవాహనుడే.
ప్రతి ఏటా తద్దినం పెట్టాలి…
మాసిక-సంవత్సరీక, జల తిల తర్పణాదులతో పితరులకు తనకి భౌతికమైన సంబంధం తీరిందంటాము, కానీ వారితో మన ఆత్మిక సంబంధం ఇంకా కొనసాగుతున్నందున ఏటా శ్రాద్ధ క్రియ జరపాల్సిందే, మహాలయ పక్షములలో వారిని గుర్తు చేసుకోవలసిందే అంటోంది శ్రాద్ధకల్పం అనే గ్రంధం. నాడీ గ్రంథాలలో గురుగ్రహం జీవుడిగా చెప్పారు. శని భగవా నుని ఆయుష్కారకునిగా కూడా పేర్కొన్నారు.
కర్త ప్రపితామహుడు ముత్తాత-ఆదిత్య రూపీ శాశ్వత మైన మోక్షాన్ని పొందలేడు. ఈ కారణంగా ఏటా తద్దినాలు పెడుతూ ఉండవలసినదే. మనలో చాలా మంది గయా శ్రాద్ధం పెట్టాం కదా అని వార్షిక తద్దినాలు పెట్టడం మానేస్తున్నారు. అది శాస్త్ర సమ్మతం కాని విషయమని గ్రహించాలి. ఏటా తద్దినం పెట్టడం వలన పితరుల ఆశీర్వాద బలం వలన జాత కుని ఆయుష్షు పెరుగుతుందని చాలా మందికి తెలియదు. అందుకే వారి కోసం కాకున్నా కర్త తన ఆరోగ్య-ఆయుష్షుల కోసమైనా వార్షిక శ్రాద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానరాదు. వార్షిక శ్రాద్ధము పెట్టని కర్తకి, అతడి సంతానానికి ఆయుష్షు-ఆరోగ్యము రెండూ సరిగా ఉండవు.
కాకికి – పితరులకి సంబంధం?…
శని భగవానుడు వాయు-భూ తత్వాలకి ప్రతీక మకరం-భూ తత్వమూ/ కుంభం- వాయు తత్వము. అసలు సహజంగానే శని వాయుగుణ ప్రధానుడు. వృద్ధులైన పితరులకి కారకుడు. పితరులు వాయు స్వరూపులని చదివాము.ఈ కారణంగా కాకి భుజించే కాకి పిండము అత్యంత వేగంగా పితరులను చేరుతుంది. కాకికి పిండం పెట్టడం అనేది పంచ మహాయజ్ఞాలలో ఒకటైన భూతబలి కిందకు కూడా వస్తుంది.















