రావణుడి రాక్షస కొలను
కైలాస పర్వతానికి సమీపంలో మానస సరోవరానికి పశ్చిమాభిముఖంగా దాదాపు 5 మైళ్ళు నడిస్తే రావణుడి రాక్షస కొలను వస్తుంది .ఇందులో స్నానం చేయడం నిషిద్ధం. ప్రచారంలో ఉన్న నమ్మకాల ప్రకారం రావణుడు ఈ కొలనులో స్నానం చేశాడు . అతను శివుడిని పూజించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుని దర్శనానికి ముందు అతను ఈ కొలనులో స్నానం చేసి దారిలో పార్వతిని చూశాడు . శివుడుఆతని భక్తి కి మెచ్చి ఏం కావాలో కోరుకో అని అడిగాడు . అప్పుడు రావణుడు అసంబద్ధ కోరిక కోరాడు. అయితే ఆ కొ లను లో స్నానం చేయడం వల్లనే అతను అలా తప్పుగా ఆలోచించాడ ని కథ చెబుతారు .
రావణ కొలనులో స్నానం చేయడానికి , నిరాకరించడానికి వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఈ నీళ్ల లో కొన్ని ప్రత్యేక సహజ వాయువులు ఉన్నాయని, ఇందులోని నీరు కొద్దిగా విషపూరితమైందని చెబుతారు. ఇందులో స్నానం చేస్తే చనిపోరు కానీ కొన్ని ప్రతికూల ప్రభావాలు కనిపించవచ్చు .అందుకే ఈ కొలను స్నానానికి నిషిద్ధం.
రావణుడి కొలనులో ఎటుచూసినా కురచ గా ఉన్న లోయలు కనిపిస్తాయి .సూది కిందపడ్డా వినిపించే నిశ్శబ్దం ఉంటుంది . మెరిసే సూర్యుడి ప్రకాశం వెన్నెల ఉంటుంది .ఎదురుగా హిమాలయాల వరుసలు, మెరిసిపోయే గిరి శిఖరాలు అద్భుత దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. మంచుకొండలు రాక్షసుల్లా కనిపిస్తాయిఈ. కొలను నీరు నల్లగా కనిపిస్తుంది . రావణుడి కొలను 77 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది .ఈ సరోవరంలో కెరటాలు రావు .మధ్య మధ్యలో కొన్ని ద్వీ పాలు ఉన్నాయి
ఒక ద్వీపం లో ఇటుకలతో కట్టిన అరుగు, మంచంతో కప్పబడిన కుటీరం కనిపిస్తుంది. ఎవరో ఒక లామా అక్కడ ఉన్నట్టుంది .ఈ కొలను కు కొద్ది దూరంలో విచిత్రమైన బండరాయి త్రిశూలం ఆకారంలో కనిపిస్తుంది .అది ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాదు. చలికాలంలో రాక్షస సరోవరం పూర్తిగా మంచుతో కప్పి ఉంటుంది ఈ సరోవరాన్ని చుట్టి రావడం అసంభవం కానీ ఈ వాతావరణం ఒక తపో భూమి లాగా కనిపిస్తుంది .రాత్రి ఇక్కడ బస చేయడం సాధ్యం కాదు. రావణుడి రాక్షస తటాకం చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి అల్మోరా నుంచి ఉంది . ఇక్కడ నుండి 210 మైళ్ళ దూరంలో ఆ స్థలం ఉంది. ఇక్కడ విశ్రాంతి గృహాలు, తినుబండారాలు దొరకవు. ధైర్యవంతులు మాత్రమే ఈ కొలను సందర్శించగలరు…
– ఈతరం భారతం















