EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

అబ్బో… ఇక డ్యూటీ అవర్స్ 12న్నర గంటలు(ట)!

‘భారత్ దట్ వాజ్ ఇండియా’ పుస్తకం లో ఓ చోట ఇప్పుడు రోజుకు 12 గంటలు పని చేయడం వల్ల టార్గెటెడ్ ప్రొడక్టివిటీ.. రావడం లేదు. అందుకని డ్యూటీ అవర్స్ను పన్నెండున్నర గంటలకు పెంచారు అని రాయడం చూసి.. రచయితను తిట్టుకున్న.. మంచోడు మంచోడు అనుకుంటే.. ఇదేందిరా బై అనుకున్న. ఇప్పుడు 8 గంటల డ్యూటీకి లంచ్, టీ టైం కలిపి.. 9 గంటలు వర్క్ చేయడమే గగనమైపోతుంటే.., ఈయనేంది 12న్నర గంటల డ్యూటీ అంటాడు. అని కొపమెుచ్చింది. 8 గంటల డ్యూటీ కార్మికులు ఎంతో కొట్లాడి సాధించుకుంటే… ఈసారు గారేమో.. 12న్నర గంటలు చేస్తాడా? ఈయనేమన్నా పాలకుడా అని తిట్టుకున్నాను.

కానీ మన దేశంలో కార్మిక చట్టాల సంస్కరణలు జరుగుతున్న క్రమంలో… ఈ ఏడాది ఏప్రిల్లో 12 గంటల డ్యూటీ చేయించుకోవచ్చంటూ.. ప్రభుత్వం అనుమతిచ్చిన.. సంగతి గుర్తొచ్చింది. దాన్ని ఇప్పటికే ఆరు రాష్ట్రాలు అమలుపరుస్తున్నాయి కూడా. అలీ బాబా చీఫ్ జాక్ మా తన సంస్థలో ఉద్యోగులు రోజుకు 12 గంటలు, వారానికి ఆరు రోజులు పని చేయాలంటేనే..గగ్గోలు లేచింది. ఆయన భయపడి తోక ముడిచాడనుకోండి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వమే 12 గంటలు చేసింది. అంటే రాబోయే.. 15, 20 ఏళ్లలో రచయిత ఈ బుక్లో చెప్పినట్టు అవుతుందని నమ్మాల్సిందే.

ఇప్పటి ప్రభుత్వం పని గంటలు పెంచడం మాత్రమే చేసింది. బుక్లో రాసింది రెస్పాన్సిబులిటీ గవర్నమెంట్ కాబట్టి పెంచిన డ్యూటీ అవర్స్ వల్ల కార్మికులు నష్టపోతున్న ఎనర్జీని ఛార్జ్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంది. ఆ శక్తిని రీఫిల్ చేయడానికి సరిపడా విటమిన్ సిగరెట్లను ప్రజలకు సరఫరా చేస్తుంది. ఆ సిగరెట్లతో పర్యావరణానికి కూడా ప్రయోజనం కలుగుతుందట.

ఇలాంటి ప్రభుత్వం ఉంటే.. 12 గంటలేంటి 16 గంటలైనా పని చేయెుచ్చు… రచయిత అలా రాయడం కరెక్టే అనుకున్నాను. ‘భారత్ దట్ వాజ్ ఇండియా’లో చెప్పినట్టు మనకూ 12 గంటల డ్యూటీ కామన్ అవ్వచ్చేమో…!

పుస్తకం కావాలనుకున్నవారు….

7730076637 కి మెసేజ్ పెట్టగలరు 

రేపు మరో పోస్ట్…

     

Related News

Select the Topic
Scroll to Top