గంగ దర్వాజ
( తెలంగాణ సంస్కృతి మురిపాల ముచ్చట్లు)
తెలంగాణ పల్లె జీవనం చుట్టూ అల్లుకున్న సంస్కృతులు, సంప్రదాయాలు, పండుగలు, పబ్బాలు, ఆహారపు అలవాట్లు, అనుబంధాలు, కథలు, విందులు, వినోదాల సమీకృత సమ్మేళన పరిమళమే గంగ దర్వాజ. విశిష్ట పరిశోధకులు డాక్టర్ మట్ట సంపత్ కుమార్ రెడ్డి స్వీయ అనుభవాలు, అనుభూతులివి. సారె గంపలు- ఊరేగింపులతో ప్రారంభమై కాముని భూతం- కథలు కథలు అన్న 71 అంశాలు ఇందులో ఉన్నాయి. గనె చిక్కుడు కథ, ప్యాలాలు – ముద్దలు, సద్దిబువ్వ- సుద్ది, భూ చక్రపుగడ్డ, మలీద ముద్దులు, గరిగబుట్టి వంటి ఎన్నో అంశాలను రచయిత ఆసక్తిని కలిగిస్తూ అసాంతం చదివించేలా చక్కగా వివరించారు.
వాగ్మయి ప్రచురణలు, కరీంనగర్, వెల : రూ. 200/-, పేజీలు 164, ఫోన్: 9849 470 792
సమీక్షకులు : డా. తిరునగరి శ్రీనివాస్, 9441464764
















