ఈతరం భారతం పుస్తక సమీక్ష
ఈ మధ్యనే “మెలొడీస్ ఆఫ్ లైఫ్” ఇంగ్లీష్ అనువాద పుస్తకం చదివాను. చదివాక దీని గురించి రెండు మాటలు మీ అందరితో పెంచుకోవాలని అనిపించింది.ముందుగా అసలు ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ ఎందుకు చదవాలో చెబుతాను. జీవితం మనం అనుకున్నట్లు జరగదు. దేవుడు తయారు చేసిన స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. లెక్చరర్ లేదా సైన్టిస్ట్ కావలసిన కుర్రాడు ఒక నాటు పడవ వల్ల జర్నలిస్ట్ అయ్యాడు. పుట్టుక నుంచీ ఎన్నో కష్టాలు మరెన్నో నష్టాలు వచ్చినా స్థిర చిత్తంతో ముందుకు సాగుతూ అడుగు పెట్టిన ప్రతి రంగంలో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. సరదాగా సాగిన రచనలో పలు చోట్ల వ్యక్తిత్వ సూత్రాలున్నాయి. సామాన్యనిగా ఉంటూ అసమాన్య ప్రజ్ఞ చూపిన కుర్రాడు తాను వ్రాసిన ప్రతి అక్షరం లో బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నాడు. “ఇద్దరమ్మలు” అంటూ వ్రాసిన భాగం తప్పక చదివి తీరాలి. మన పల్లెలు 1950 నుంచి 1990 వరకు ఎలా ఉన్నాయో చెబుతూ, ఆ నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలను స్పృశించిన తీరు నన్ను ఆకర్షించింది. 40 ఏళ్ల జర్నలిస్ట్ అనుభవం, సమాజాన్ని తనదైన కోణంలో చూసిన తీరు, రచనలో తనకంటూ ఏర్పరుచుకున్న శైలి , సహజత్వం, నిజాయితీ, అమాయకపు పోకడ … వెరసి ఈ పుస్తకం చదువుతుంటే కొన్ని చోట్ల మనకు మనమే కనబడతాము. నేటి తరం పిల్లలకు ఐదారు దశాబ్దాల క్రిందటి జీవన స్థితిగతులను కళ్లకు కట్టినట్లు చూపించారు రచయిత. ఈ కాలం తెలుగు వారి పిల్లలు చాలా మంది తెలుగు మాట్లాడుతున్నా చదవలేరు. అలాంటి వారి కోసమే ఎంతో శ్రమకోర్చి జీవనరాగాలు -1 పుస్తకాన్ని ఇంగ్లీష్ అనువాదంగా Melodies of Life -1 పేరుతో తీసుకొచ్చారు రచయిత. తెలుగు వారే కాదు, అన్ని ప్రాంతాల వారు చదవతగిన పుస్తకంగా అనువాద ప్రక్రియ సమయంలో శ్రద్ధ తీసుకున్నారు. ఈ పుస్తకం కొని చదవండి. సందర్భం ఏదైనా సరే ఈ పుస్తకాన్ని బహుమతి రూపంలో కానీ లేదా జ్ఞాపకంగా కాని పంచిపెట్ట వచ్చు . మంచి రచనలకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వండి. చేతిలో పుస్తకం తీసుకుని చదవడం ఎలాంటిదంటే ఎక్కడో దూరాన ఉన్న మన పిల్లలు ఆన్ లైన్ లో చూడటం కంటే నేరుగా మన ఇంటికి రావడం లాంటిది. పుస్తకం కావలసిన వారు నేరుగా రచయితకు కాల్ చేయవచ్చు .
* రచయిత తుర్లపాటి నాగభూషణ రావు కాంటాక్ట్ నెంబర్ 9885292208 (వాట్సప్ మరియు గూగుల్ పే నెంబర్) అసలు ధర : ₹ 405 స్పెషల్ ఆఫర్ : ₹ 250 పోస్టల్ ఛార్జెస్ : లేవు. (ఫిబ్రవరి నెల వరకు మాత్రమే)
పుస్తక సమీక్ష: పోణంగి బాల భాస్కర్















