వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి పొంగులేటి.
15.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విషజ్వరాలతో బాధ పడుతున్న స్థానికులను(రోగులను) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం పరామర్శించారు. సంబంధిత అధికారులకు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూగత పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఏ గ్రామానికి వెళ్లిన మౌలిక వసతులపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం పేద వారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వీలైనంత తొందరగా నిధులు మంజూరు చేయిస్తానని తెలియజేసారు.ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న గత ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందని గ్రామాలను తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం కచ్చితంగా చేస్తుందని స్పష్టం చేసారు.















