యాదాద్రి భువనగిరి : ఈతరం భారతం ప్రతినిధి 01.10.24 పౌరాణిక, సాంఘీక నాటకాలను సమాజం ఆదరించి కాపాడవలసిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ తిరునగరి శ్రీనివాస్, సాయికృప కృషి కళాశాలల నిర్వాహకులు దరిపల్లి ప్రవీణ్‌కుమార్ అన్నారు. భువనగిరి బంజారాహిల్స్‌లోని సాయికృప కృషి కళాశాలల ఇండోర్ ఆడిటోరియంలో మంగళవారం ప్రముఖ జాతీయ రంగస్థల నటుడు, సినీ దర్శకుడు టి రాము సారధ్యంలో దరిపల్లి అనంతరాములు జ్ఞాపకార్థం కాంతారావు కళాపరిషత్ ఆధ్వర్యంలో అలలు లేని సముద్రం సాంఘీక నాటక ప్రదర్శన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సాంకేతిక యుగం ప్రభావంతో నాటకాల పట్ల ఆదరణ తగ్గడం బాధాకరమని చెప్పారు. నాటకం మానవ జీవన సంస్కృతికి ప్రతిబింబమని వారు తెలిపారు. నాటక రంగంలో కృషి చేస్తూ ఎంతో మంది నటులతో నాటక ప్రదర్శనలు ఇస్తూ ఆ రంగ పటిష్టత కోసం కృషి చేస్తున్న రామును వారు అభినందించారు.
జాతీయ నటుడు రాము మాట్లాడుతూ దరిపల్లి నవీన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్‌ల సౌజన్యంతో నాటక ప్రదర్శనలను ఎంతో కాలంగా తాము ఇస్తున్నామని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎం రవికుమార్, ప్రముఖ రంగస్థల నటులు సురభి రాయలు, కుందుర్తి వెంకటకృష్ణ, రామశర్మ, కత్తి సుందరమ్మ, సురభి ఆవేటి వెంకటేశ్, అరుణాదేవి, శేషుకుమారి, సురభి ప్రియాంక, త్రిముర్తులు, శోభ, ఇంద్ర, ప్రసాద్, ధనంజయశర్మ, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. నాటక ప్రదర్శనలో నటించిన నటీనటులను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. పెద్దసంఖ్యలో నాటకాభిమానులు, ప్రజలు హాజరయ్యారు.















