హైదరాబాద్ డిసెంబర్ 19 (ఈ తరంభారతం )ప్రేమ..భాషతో పని లేని పదం.. మాట చెప్పలేని పదం.. కళ్ళకు మాటలు నేర్పే పదం.. పెదాలతో ఓనమాలు దిద్దించే పదం.. ప్రేమ!! అది ఓ మ్యాజిక్. ఆ మ్యాజిక్ తో స్టార్ మా “ఇస్మార్ట్ జోడి సీజన్ 3″ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు సరికొత్తగా మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టెలివిజన్ ప్రయోక్త గా, షో నిర్వాహకుడిగా, సినిమా దర్శకుడిగా, వివిధ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రేక్షకుల్ని సమ్మోహన పరచి, స్పష్టమైన ముద్ర వేసిన ఓంకార్ “ఇస్మార్ట్ జోడి సీజన్ 3″ని మరింత ట్రెండీ గా, తరాలతో పాటు మారుతున్న అభిరుచుల్ని కూడా ఆకర్షించేలా అందించబోతున్నారు. సెలబ్రిటీ జంటల మధ్య అనుబంధానికి, అన్యోన్యతకి, అనురాగానికి కావాల్సినంత వినోదం కలిపి ఓ కొత్త ఫార్ములాతో రాబోతోంది “ఇస్మార్ట్ జోడి సీజన్ 3”. ఏకాగ్రతకి పరీక్ష “ఇష్మార్ట్ జోడి సీజన్ 3”. స్టార్ మా లో ఈ శనివారం రాత్రి 9 గంటలకు “గ్రాండ్ లాంచ్ ఈవెంట్” తో ఈ షో ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.















