హైదరాబాద్ సెప్టెంబర్ 20 (ఈతరం భారతం );జెమినీ టీవీ లో “నువ్వే కావాలి”అనే సరికొత్త ధారావాహిక ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నది రాజా.. ఒక ప్రభుత్వ ఉద్యోగి..! బాబాయి చేసిన మోసంతో ఆస్తి, డబ్బు, ఇల్లు పోగొట్టుకుని, దానికి కారణం అమాయకుడైన తన తండ్రి అని భావించి.. అట చిన్నానా మీద, ఇటు కన్న తoడ్రి మీద ద్వేషం పెంచుకుని బ్రతుకుతుంటాడు.అక్షయ కాలేజ్ లో గోల్డ్ మెడలిస్టు..! ఏది ఆలోచించకుండా అందరికి సహాయం చేస్తుంది. ఎన్నో బాధలు ఉన్నా ఆమెకు కుటుంబం అంటే పంచప్రాణాలు. కుటుంబమే వద్దు అనుకుంటున్న అబ్బాయి, కుటుంబమే సర్వస్వం అనుకుంటున్న అమ్మాయికి దెగ్గరైతే ఏమవుతుంది?తప్పక చూడండి… మన జెమినీ టీవీ లో సరికొత్త ధారావాహిక “నువ్వే కావాలి”. ఈనెల 23 నుంచి ప్రారంభం…. సోమవారం నుంచి శనివారం వరకు….సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమవుతుంది















