EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

జెమినీ టీవీ లో సరికొత్త సీరియల్స్ రాధ మరియు మూడు ముళ్ళు …. ! ఈ నెల 30 నుండి ప్రారంభం

హైద్రాబాద్.సెప్టెంబర్ 29(ఈతరం భారతం) 29.9.24 : అమ్మ చేతి ముద్ద , చందమామ రావే జాబిల్లి రావే , ఇవేగా మనకి అమ్మ ని జ్ఞాపకం తెచ్చే మధుర స్మృతులు . కానీ అలాంటి జ్ఞాపకాలు ఏమీ లేకుండా ఉంది ఖుషి . అమ్మ ని పొందాలని ఆరాటపడే ఖుషికి మన రాధ ఎదురుపడింది . అమ్మని తలపించింది . దాంతో ఖుషి రాధే తనకి అమ్మలా రావాలని పట్టు పట్టింది . మరి రాధ ఖుషి కి అమ్మ కాగలిగిందా రాధ ఎన్ని ఒడిదుడుకులని ఎదుర్కొంది ఎలా దైవం తనకి ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించింది ? ఎలా తన జీవితాన్ని సాగించింది చూడాలంటే ? చూడండి మన జెమినీ టీవీ లో సరికొత్త డైలీ సీరియల్ రాధ… ఈ నెల 30 నుండి ప్రారంభం .సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8:30 గంటలకు .

నీలవేణిపల్లెపాలెం అనే ఒక చిన్న గ్రామంలో తన ఇద్దరు చెల్లెళ్లే తన ప్రపంచంగాబతుకుతుంటుంది. మూడు ముళ్ళు వేసేవాడు తన జీవితంలోకి వస్తేతన చెల్లెళ్ల జీవితాలు ఏమైపోతాయో అనుకుని పెళ్లే వద్దనుకుంటుంది.అలాంటి నేలవేణి జీవితంలోకి తన ప్రమేయమే లేకుండా ఓ వ్యక్తి ప్రవేశించి తన మెడలో  మూడు ముళ్ళువేస్తే ?తనది కాని ప్రపంచంలోకి ఏడు అడుగులు వేసిన నీలవేణికి అడుగడుగునా సమస్యల అగాధాలు ఎదురైతే,వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది…చూడండి  జెమినీ టీవీ లో సరికొత్త సీరియల్ మూడు ముళ్ళు….! ఈ నెల 30 నుండి ప్రారంభం.. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 09:00 గంటలకు ….

Related News

Select the Topic
Scroll to Top