ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 1 :
సత్యరాజ్, ఉధయభాను, వశిష్ట ఎన్ సింహా కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’.
మైథలాజికల్ సోషల్ డ్రామాగా దీనిని మోహన్ శ్రీవత్స తెరకెక్కించారు. మారుతి సమర్పణలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ అయింది. విడుదలై మూడు రోజులే అవుతున్నప్పటికీ ఎక్కువమంది థియేటర్స్‌లోకి వెళ్లడం లేదు. ఈక్రమంలో.. తాజాగా, డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ”నేను ఇప్పుడే బార్బరిక్ సినిమాకు వెళ్లాను. థియేటర్స్‌లో పదిమంది ఉన్నారు. కొంతమందిని మూవీ ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని అన్నారు.కానీ ఎందుకు థియేటర్ మొత్తంలో పదిమంది ఉన్నారో నాకు అర్థం కాలేదు. రెండున్నరేళ్లు పిచ్చికుక్కలా కష్టపడ్డాను. నా భార్య కూడా మూవీకి వెళ్లి ఇంటికి వచ్చింది. ఆత్మహత్య చేసుకుంటానని అనుకుని వచ్చేసింది. మలయాళం కంటెంట్లు చూస్తారని చేశాను కానీ ఎవరూ చూడట్లేదు. కాన్ఫిడెంట్‌గా రిలీజ్‌కు ముందు ఓ మాట అన్నాను. సినిమా కనుక నచ్చకపోతే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా అన్నా కూడా జనాలు రాలేదు. నాకు అర్థం కావట్లేదు.. అసలు ప్రేక్షకులు థియేటర్స్‌కు ఎందుకు రావట్లేదో. నేను మలయాళ ఇండస్ట్రీకి వెళ్తాను. అక్కడే సినిమాలు చేస్తా. ఒక తెలుగు ఆడియన్‌కి తెలుగోడు మూవీ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా” అని బోరున ఏడుస్తున్న వీడియోను షేర్ చేశాడు.















