ఈతరం భారతం సాహిత్యాంశం :
ప్రొఫెసర్ ఎం కులశేఖర రావు తాత్పర్య రచన చేసిన శతకమిది. ఇది బాలల నీతి పద్యమాల. ఆధ్యాత్మిక, సామాజిక, భక్తి తత్పరతతో కూడిన సందేశాత్మక పద్యాలు, వాటికి వివరణ కూడా ఇందులో ఉంది. సులభమైన శైలిలో బాలలు చదువుకొని గుర్తుంచుకునే విధంగా ఈ శతక పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలలోని నీతిని గ్రహించి మనుగడ సాగిస్తే కీర్తిని, అభివృద్ధిని సాధించ వచ్చన్న భావనను తాత్పర్య రచనలు కులశేఖర రావు వ్యక్తపరిచారు.
లక్ష్మీ భవాని పబ్లిషర్స్, వెల: రూ. 20/-, పేజీలు: 52, దొరుకు చోటు : గవర్నరుపేట, విజయవాడ.















