క్షణాల పరిమళం
( తెలుగు అనుసృజనం )
95 కవితా ఖండికలతో వెలువడిన తెలుగు అనుసృజన కావ్యమే క్షణాల పరిమళం. డాక్టర్ బన్వారీలాల్ అగర్వాల్ స్నేహి హిందీ మూలానికి డాక్టర్ మరింగంటి లక్ష్మణాచార్యులు అందించిన అనువాదం ఇది. మనిషి జీవన పార్శ్వాలను లోతుగా పరామర్శించిన తీరు ప్రతి ఖండికలోనూ కనిపిస్తుంది. జీవిస్తున్నాను, ఆ మనిషి, ఒంటరినై పోతి నేను, ఈ శవాల గుంపులో, గరళం త్రాగించారు, మనిషిలో కొండచిలువ, కాలం నిలబడి ఉన్నది వంటి ఖండికలు వర్తమాన సమాజ వైచిత్రిని విమర్శనాత్మకంగా విశ్లేషించాయి.
మోహన్ పబ్లికేషన్స్ రాజమహేంద్రవరం, వెల : రూ. 125 /-, పేజీలు: 99, ఫోన్ :9948066684
సమీక్షకులు : డా. తిరునగరి శ్రీనివాస్, 9441464764

















