ఆహార నాణ్యత నిజ నిర్ధారణ పై దృష్టి సారించే
ఖమ్మం ఆహార పరిరక్షణ,ప్రమాణాల శాఖ
ఈతరం భారతం వార్తాంశం : రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
ఆహార భద్రత ప్రమాణాలపై ఎల్లప్పుడూ దృష్టి పెడతామని ఆహార భద్రత గెజిటెడ్ అధికారి రాయపూడి కిరణ్ కుమార్,ఆహార తనిఖీ అధికారి సిహెచ్ లోకేష్, మరియు ల్యాబ్ అనాలసిస్ట్ బి.రతన్ కుమార్ లు తెలిపారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ల్యాబ్ టెస్ట్ వాహనం అందుబాటులో ఉన్నందున్న ఫిర్యాదులు అందిన వెంటనే శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపిస్తాము వెంటనే రిపోర్టులు వచ్చే సౌకర్యం అందుబాటులో ఉంది అని చెప్పారు.
ఆహార పరిరక్షణ,ప్రమాణాల శాఖ (ఫుడ్ సేఫ్టీ) ఆధ్వర్యంలో వారు విస్తృతంగా వారంలో రెండు లేదా మూడు సార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొబైల్ లాబరేటరీ వాహనం ద్వారా తనిఖీలు నిర్వహిస్తుంటారు.ఖమ్మం ఆహార పరిరక్షణ,ప్రమాణాల శాఖరోజుకి 3000 వేల రూపాయల కన్నా తక్కువ ఆపైన ఎక్కువ లాభాన్ని అర్జించే వ్యాపార సంస్థలకు రిజిస్ట్రేషన్ లైసెన్స్ లు జారీ చేస్తుంది.హోటల్స్, ఆయిల్ మిల్స్, కిరాణా షాపులు,
రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపడుతుంది.తనిఖీలు మాత్రమే కాకుండా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు, మురికివాడలలో ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్నం భోజన కార్మికులకు శిక్షణ ఇస్తుంటారు.
తనిఖీలు చేసి వెంటనే శాంపిలను హైదరాబాదులోని నాచారంలో ఉన్నటువంటి ఫుడ్ లేబరేటరీ కి పంపిస్తారు.గతంలోఫలితాలు రావడానికి 41 రోజులు పట్టేది ప్రస్తుతం కేవలం 14 రోజుల్లో మేము పంపించిన శాంపిల్స్ కి ఫలితాలు వస్తున్నాయి ఆ ఫలితాలను బట్టి శాంపిల్స్ నెగెటివ్ ఫలితాలు వచ్చినట్టయితే అనంతరం కేసులు నమోదు చేస్తారు.ఈ నమోదు చేసిన కేసులు సామాన్య కోర్టులకు,జేసీ కోర్టులకు వెళుతుంటాయి. సాధారణంగా ఫైన్ 1000 రూపాయల నుండి ఆయా కేసులను బట్టి 5 లక్షల వరకు విధిస్తుంటారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-2025 లో 1200 కేసులు నమోదు చేసారు.17 కేసులు క్లోజ్ అయ్యాయి సామాన్య కోర్టులో 20 కేసులు పెండింగ్లో ఉన్నాయి జేసీ కోర్టులో 14 కేసులు పెండింగ్లో ఉన్నాయి . ఇప్పటివరకు ఒక లక్ష 23 వేల రూపాయల ఫైన్ విధించారు.
ఈ మధ్యకాలంలో మీడియా వాళ్ళ నుండే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి అని ఆహార భద్రత అధికారులు తెలియజేసారు.















