EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

సమయం వృధా

ఈతరం భారతం వార్తాంశం

వస్త్రధారణ వ్యక్తిగతం. దీనిని ఎవ్వరూ కాదనలేరు. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే వ్యక్తులు రకరకాల వస్త్రధారణతో కనిపిస్తారు స్థానికంగా అంగీకరించిన సంస్కృతిని పాటించడం ఆనవాయితీ. భారతదేశం   భిన్న సంప్రదాయాల , విభిన్న వస్త్రధారణల ఒక అద్భుతమైన ప్రదేశం. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది.ఇక్కడ విభిన్న రకాల ప్రజలు తాము   నివ సిస్తున్న సమాజంలో తాము ఒకరిగా జీవిస్తూ స్థానిక పద్ధతులను ఆచరిస్తూ ఉండడం శతాబ్దాలుగా చూస్తున్నాం. తాము పనిచేస్తున్న ఏ రంగంలోనైనా స్త్రీ పురుషులు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వస్త్రధారణ చేస్తారు. కానీ సినిమా రంగంలో నటులు పలువురి దృష్టిని ఆకర్షించడానికి కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వారికి ప్రచారం కావాలి. ఇది అందరూ అంగీకరించిన సత్యం. ప్రత్యేకించి నటీమణులు గ్లామర్ కోసం కొత్త గెటప్ లను ఆశ్రయిస్తుంటారు ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ వారి వేషధారణ చూసేవారికి ఇబ్బందిని కలిగిస్తే అప్పుడు వారిపై పబ్లిక్ గా కామెంట్ చేస్తే ఎవరికైనా అవమానం లా అనిపించవచ్చు. కానీ సమాజంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. భావ ప్రకటన స్వాతంత్రం ఉంది. ఇది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు అని శాసించే అధికారం ఎవరికి లేదు. అది అసభ్యకరంగా అనిపిస్తే కామెంట్ చేసిన వారిని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ సౌకర్యం ఉందని అందరికీ తెలుసు. ఇటీవల సినిమా నటుల మధ్య ఒకరి గురించి చర్చ బాగా జరిగింది. అలా ఉండడం తప్పని, కూడా చెప్పలేము. కానీ మన అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు. ఈ అంశాన్ని అనవసరంగా సాగదీసి సమయం వృధా చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు.

Related News

Select the Topic
Scroll to Top