ఈతరం భారతం తైవాన్ డిసెంబర్ 24
తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ తీరప్రాంత కౌంటీ అయిన టైటుంగ్ లో బుధవారం భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. ఈ ప్రభావంతో రాజధాని తైపీ లో భవనాలు కుప్పకూలిపోయాయి. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం.. భూకంపం భూమికి 11.9 కిలోమీటర్ల లోతులో నమోదైంది. స్థానిక మీడియా సంస్థ తైవాన్ న్యూస్ ప్రకారం.. భూకంపం కేంద్రం టైటుంగ్ కౌంటీ హాల్‌కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.















