EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..   బిజెపి లో చేరిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత

పెద్దపల్లి, ఎప్రిల్ 29 ( ఈతరం భారతం న్యూస్): పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ వెంకటేష్ నేత కొద్ది రోజులకే పార్టీ వీడటం కాంగ్రెస్‌కు మైనస్ కానుంది.

 

 

Related News

Select the Topic
Scroll to Top