EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

సహజీవనం చేస్తోందన్న కారణంతో ఓ మహిళపై దాడి. వివస్త్రగా చేసి కళ్లల్లో కారం కొట్టిన వైనం

కామారెడ్డి  (ఈ బీ న్యూస్ );సహజీవనం చేస్తోందన్న కారణంతో ఓ మహిళపై దాడి జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారం మండలంలో జరిగింది. అంతటితో ఆగకుండా మహిళను వివస్త్రగా చేసి కళ్లల్లో కారం కొట్టారు. మండలానికి చెందిన ఓ మహిళ.. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన నరేష్ అనే యువకుడితో సహజీవనం చేస్తోంది. గుట్టుగా సాగుతున్న వీరి వ్యవహారం కొన్నాళ్లకు బయటపడింది. నరేష్ కు పెళ్లి కావడంతో పద్ధతి మార్చుకోవాలని గ్రామపెద్దలు సూచించారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. మరోసారి వారిద్దరూ సహజీవనం చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నరేష్ భార్య కుటుంబ సభ్యులు కోపంతో ఊగిపోయారు. దుర్భాషలాడుతూ నరేష్ తో పాటు, మహిళపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా మహిళను వివస్త్రగా చేశారు. కళ్లల్లో కారం కొట్టి కులం పేరుతో దూషించారు.దాడి నుంచి ఎలాగో అలా తప్పించుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తనపై జరిగిన దాడిని వివరించారు. కులం పేరుతో దూషించారని తెలిపారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ ఇన్సిడెంట్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళపై దాడి చేసిన మాచారెడ్డి మండలం అక్కపూర్ కు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top