బాసర మే 10 (ఈతరం భారతం);స్థానికంగా శివాలయం మరియు శ్రీ ముత్యాలమ్మ దేవాలయాలలో శ్రీ వాసుదేవ సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ సౌభాగ్యవతి శారద రాజేశ్వర్ దంపతుల ఆధ్వర్యంలో నాగమూర్తి అశ్వినిదేవి,సద్గుణ రవిశంకర్ దంపతుల సహకారము తో కోటి పార్థివలింగార్చన మహోత్సవము అత్యంత వైభవముగా జరిగినది . ముందుగా దీపారాధన, కలశస్థాపన ,గణపతి ,గౌరీపూజ ,నవగ్రహ ఆరాధన ,మరియు భక్తులు పుట్టమన్ను చేత 108 పార్థివ లింగములు చేసి ఆ శివలింగాలకు పంచామృత అభిషేకము రుద్రాభిషేకము, భస్మార్చన ,పుష్పార్చన ,బిల్వార్చన, ధూప దీప నైవేద్యములతో పూజ చేసిరి. శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి మరియు బాసర శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులుశివ శ్రీ నిర్మల అంబికానాథ శర్మ మాట్లాడుతూ బాసర క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాల దేవాలయం ఈశాన్య భాగమున కోటి పార్థివలింగ స్తూపము నిర్మించినామని అందులో కోటి (పార్థివ)శివలింగములను స్థాపన చేయ దలచినామని , కోటిలో 90 లక్షల శివలింగాలను భక్తులతో చేయించడం, స్థాపన చేయడము జరిగినదని ఇంకా 10 లక్షలు లింగాలు చేయవలసి ఉన్నదని అన్నారు. శ్రీ వాసుదేవా సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ సౌభాగ్యవతి చిగురు శారద రాజేశ్వర్ మాట్లాడుతూ జంట నగరాలలోని వివిధ దేవాలయ ప్రాంగణంలో తమ యొక్క శిష్యుల సహకారంతో ఒక లక్ష లింగాలు చేయించి అతి త్వరలో బాసర క్షేత్రానికి పంపించే ఏర్పాటు చేస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు శశి శర్మ మహాలక్ష్మి ,పార్వతి, పూర్ణిమ ,లతా, లక్ష్మీ ప్రియ, వినోది,సీత, శైలజ,సుభాషిణి, లక్ష్మీ,భారతి,సుజాత, రజిత, తదితరులు పాల్గొన్నారు. కోటి పార్థివలింగ పూజ అనంతరము బాసర నుండి విచ్చేసిన సరస్వతీ స్తూప పార్థివలింగస్తుపసహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిర వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాధశర్మ ను నిర్వాహకులు చిగురు శారద రాజేశ్వర్ దంపతులు సన్మానించారు.















